డయల్ 100 ద్వారా 3784 ఫిర్యాదుల పరిష్కారం..

 

పోలీస్ కమిషనర్ సత్యనారాయణ
పెద్దపెల్లి మే 7  (globelmedianews.com):
రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా ల శాంతిభద్రత  సమస్యలపై సత్వర స్పందన, పరిస్కారం కోసం ఎర్పాటు   చేసిన డయల్ 100 సేవలకు మంచి స్పందన వస్తుందని రామగుండం పోలీసు కమిషనర్  వి.సత్యనారాయణ అన్నారు. తగాదాలు, రహదారి ప్రమాదాలు , అసాంఘిక కార్యకలాపాలు , హత్యలు,  హత్యాయత్నాలు, ఆత్మహత్యలు,  ఆపద సందర్భాలలో డయల్ 100 సేవలను  ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని  అన్నారు. 


డయల్ 100  ద్వారా 3784 ఫిర్యాదుల పరిష్కారం..

ఏప్రిల్ నెలలొ అత్యవసర 3784  పిర్యాదులు అందడం జరిగిందని,  వాటిపై సంబందిత పోలిస్ స్టేషన్లకు సమచారం అందించి సమస్య పరిష్కరించటం జరిగిందని అన్నారు. వాటిలో 83 ఎఫ్.ఐ. ఆర్ నమోదు చేయడం  జరిగిందని తెలిపారు . శారీరకమైన నేనాలకు 483 వీటిలో 05 ఎఫ్.ఐ. ఆర్ లు నమోదు అయ్యాయని తెలిపారు. స్త్రీలపై జరిగే నేరాలకు సంబంధించినవి -363 వీటిలో 05 కేస్ లు నమోదు అయ్యాయని అన్నారు.  రోడ్డు ప్రమాదాలు సంబంధించినవి,  ఇతర ప్రమాదాలకు సంబంధిచినవి 426. వీటిలో 35 ఎఫ్.ఐ. ఆర్ లు నమోదు అయ్యాయని అయన అన్నారు. ఆస్తి (స్థిర & చర) నేరాలకు సంబంధించినవు -55.  వీటిలో 01 కేస్ లు నమోదు అయ్యాయనని అన్నారు. అదేవిధంగా ఆత్మహత్య,  ఆత్మహత్య ప్రయత్నానికి సంబంధించినవు  -151.   వీటిలో 18 కేస్ లు నమోదు చేయడం జరిగిందన్నారు.ఇతర నేరములకు సంబంధించినవి  2301 -వీటిలో 07 ఎఫ్.ఐ. ఆర్ లు నమోదు అయ్యాయని కమిషనర్ తెలిపారు.

No comments:
Write comments