1000 కోట్లకు పైగా బెట్టింగ్ లాస్

 


విజయవాడ, మే 24  (globelmedianews.com)
మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది టీడీపీ నేతల పరిస్థితి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ పార్టీ నేతలకు మరో షాక్ తగలింది. రూ.వెయ్యి కోట్లు పోగొట్టుకుని టీడీపీ వర్గాలు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వెలువడకముందు నుంచే బెట్టింగ్‌ రాయుళ్లు జయాపజయాలపై భారీగా పందేలకు దిగారు. అయితే వారిలో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుపై నమ్మకం సన్నగిల్లడంతో ఎన్నికల తేదీ నాటికి టీడీపీ గెలుపుపై ఆ పార్టీ శ్రేణులే వెనక్కు తగ్గారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న అంశం మినహాయించారు. నియోజకవర్గాల వారీగా టీడీపీ, వైఎస్సార్‌ సీపీ గెలుపోటములపై బెట్టింగులకు పరిమితమయ్యారు.ఎన్నికల పోలింగ్‌ ముగిశాక లగడపాటి లీకులిచ్చి, ఆ తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించడంతో మళ్లీ టీడీపీ శ్రేణులు బెట్టింగులకు దిగారు. రూపాయికి రూపాయిన్నర ఇస్తామని పలు నియోజకవర్గాల్లో బెట్టింగ్‌ మాఫియా రంగంలోకి దిగింది. 


1000 కోట్లకు పైగా బెట్టింగ్ లాస్
దీంతో గడిచిన పది రోజుల్లోనే రూ.700 కోట్ల వరకు చేతులు మారినట్లు అంచనాగా ఉంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం రూ.వెయ్యి కోట్లు వరకు  బెట్టింగులకు దిగారని సమాచారం. ఫలితాలు ఏకపక్షంగా ఉండటంతో టీడీపీ శ్రేణులు 80 శాతం, జనసేన 20 శాతం డబ్బులను పోగొట్టుకున్నాయి.టీడీపీ గెలుపుపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చంద్రబాబు పార్టీ శ్రేణులకు చెప్పాడు. టీడీపీయే గెలుస్తుందని బుకీలు భారీగా బెట్టింగులు పెడుతున్నారని చంద్రబాబు చెప్పాడు. అధినేతనే ఈ విధంగా ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు భారీగా బెట్టింగులకు పాల్పడ్డారు. తెలుగువారున్న అన్ని రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాల్లో ఉన్న వారందరినీ టీడీపీ నేతలు రెచ్చగొట్టి బెట్టింగుల వైపు మళ్లించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదని బెట్టింగులకు దిగారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఖజానా నుంచి లగడపాటి బినామీ సంస్థకు దోచిపెట్టిన సొమ్ముతో ఎగ్జిట్‌ పోల్స్‌ చేయించారు. పోలింగ్‌ ప్రక్రియ ముగియడానికి ఒక రోజు ముందు లీకులు ఇవ్వడం, పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ ఘన విజయం సాధించబోతుందని లగడపాటితో చెప్పించారు. ఎగ్జిట్ పోల్స్, లగడపాటి సర్వేలు, చంద్రబాబు ప్రకటనలను నమ్మిన టీడీపీ ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు, టీడీపీ సానుభూతిపరులైన బడా పారిశ్రామికవేత్తలు, నేతలు భారీగా బెట్టింగులుకు దిగారు.మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపున లోకేష్‌, వైఎస్సార్‌ సీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉండడం రసకందాయంగా మారింది. లోకేష్‌ గెలుపుపైనా బెట్టింగ్‌ రాయుళ్లు భారీగా పందేలకు దిగారు. లోకేష్‌ గెలుపుపై ధీమా ప్రదర్శించి రూ.వందల కోట్లు పోగొట్టుకున్నారు ముఖ్యంగా టీడీపీ నేతలు. చంద్రబాబు, లగడపాటి మాటలు నమ్మి బెట్టింగులకు పాల్పడి భారీగా డబ్బు పోగొట్టుకున్నారు.

No comments:
Write comments