పిల్లులను దత్తత తీసుకొని మరీ చంపుతున్నాడు

 

న్యూఢిల్లీ, మే 15, (globelmedianews.com)
అతడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఆన్‌లైన్‌లో పిల్లి పిల్లలను దత్తత తీసుకుని మరీ అత్యంత క్రూరంగా హత్యలు చేస్తున్నాడు. పదుల సంఖ్యలో పిల్లులను చంపుతూ రాక్షసానందం పొందుతున్న అతడు.. చివరికి ఊచలు లెక్కిస్తున్నాడు. అమెరికాలోని మిస్సోరీలో నివస్తున్న కైనీ లౌజడర్ అనే 20 ఏళ్ల యువకుడు పిల్లి పిల్లల హంతకుడిగా మారాడు. ఇటీవల చనిపోయిన పిల్లి పిల్లలను పడేస్తుండగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో కైనీ నేరాన్ని ఒప్పుకున్నాడు. 


పిల్లులను దత్తత తీసుకొని మరీ చంపుతున్నాడు

పిల్లి పిల్లలను చిత్రహింసలు పెట్టి చంపడం తనకు సరదా అని తెలిపాడు. వాటి తలలు, అవయవాలను కట్ చేసే ముందు నీటిలో ఊపిరి ఆడకుండా చేస్తానని, అవి గిలగిలా కొట్టుకుంటే చూసి ఆనందించేవాడినని పేర్కొన్నాడు. చనిపోయిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో పడేసేవాడినని తెలిపాడు. కైనీ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కోర్టు అతడికి రూ.35 లక్షలు జరిమానా విధించింది.కైనీ అరెస్టుకు ముందు స్థానికులు తమ పరిసర ప్రాంతాల్లో పిల్లుల కళేబరాలు కనిపిస్తున్నాయని, ఎవరో వాటిని దారుణంగా చంపి పడేస్తున్నారని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు కైనీ ఇంటి పరిసరాల్లో పిల్లి పిల్లల శరీర భాగాలు, కొద్ది దూరంలో వాటి కళేబరాలను కనుగొన్నారు. వాటి ఆధారంగా కైనీయే ఇవన్నీ చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు నిఘా పెట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు

No comments:
Write comments