బోల్తాపడిన ఆర్టీసీ బస్సు:15మందికి గాయాలు

 

జయశంకర్ భూపాలపల్లి మే 15 (globelmedianews.com)  
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండల పరిధిలోని టీవీనగర్ సమీపంలో బుధవారం ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.  పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుంచి భూపాలపల్లికి వెళ్తోంది. 


బోల్తాపడిన ఆర్టీసీ బస్సు:15మందికి గాయాలు

బస్సు టీవీనగర్ సమీపంలోని మానేరు వంతెన దాటుతున్న క్రమంలో అదుపు తప్పి వంతెన పక్కనున్న గొయ్యిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయాలపాలయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న కొయ్యూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 108 వాహనంలో క్షతగాత్రులను కాటారం, మహదేవ్పుర్, మంథని ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. 60 మందికి పైగా ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. భూపాలపల్లి ఎస్పీ భాస్కరన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదంపై ఆరా తీశారు.

No comments:
Write comments