పాక్ సాయంతో నియంత్రణా రేఖ వెంట 16 ఉగ్రవాద శిబిరాలు

 


శ్రీనగర్‌ మే 28 (globelmedianews.com)
నియంత్రణా రేఖ వెంట పాకిస్థాన్‌ సాయంతో ఇంకా 16 ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయని లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. ఇందులో దాదాపు 450 మంది ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్నారు. ఉదంపూర్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సింగ్‌ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో మొత్తం 61 మంది భద్రతా సిబ్బంది, 11 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు భారత హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 


పాక్ సాయంతో నియంత్రణా రేఖ వెంట 16 ఉగ్రవాద శిబిరాలు
మరో 142 మంది గాయపడగా.. వీరిలో 73 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం ఆరంభం నుంచి 177 ఉగ్రవాద ఘటనలు జరిగాయని ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన రోహిత్‌ చౌదరీ అనే ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా జనరల్‌ ఆఫీసర్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ సులేఖ ఈ వివరాలను వెల్లడించారు. అలాగే ఈ ఏడాది ఇప్పటివరకు 86 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. అందులో 20 మందిని నిర్భందించామన్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దల సాయంతో అనేక మందిని జనజీవన స్రవంతిలోకి తీసుకురాగలిగామన్నారు. అలాగే ఉగ్రవాదులందరినీ ఏరిపారేసే వరకు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.  

No comments:
Write comments