బసవ జయంతి వేడుకలో 20 సామూహిక వివాహాలు

 

అంగరంగ వైభవంగా కళ్యాణ మస్తు
వేలాది మంది  తరలి వచ్చిన బంధుప్రీతి
కౌతాళం మే 7 (globelmedianews.com
మండల పరిధిలో ఉప్పర హాల్ గ్రామంలో బసవ జయంతి వేడుకలు శ్రీ పూజ్య కనకప్ప తాత గారి మఠంలో   చంద్ర శేఖర్ స్వాముల వారు శ్రీ పూజ్యులు నిజ నంద స్వాముల వారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేద మంత్రాలు వేద పండితులు వేలాది మంది ప్రజలు మద్య 20 సామూహిక వివాహాలు పంచభూతాల సాక్షిగా ఒక్కటయ్యారు. మరియు సంగీతము ,భక్తి గీతములు, ప్రవచనములు మహా స్వాములచే నిర్వహించారు. తెలిపారు.మంగళవారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు  ఉప్పరహాలూ శ్రీ మర్రిస్వమీ శాస్త్రి మరియు ఆదోని శ్రీ జగదీష్ శాస్త్రి మరియు పంచాక్షరి శాస్త్రి వారిచే శ్రీ శివ లింగమును  మహా రుద్రాభిషేకం మహా వైబోవంగ జరిపించారు. 


బసవ జయంతి వేడుకలో  20 సామూహిక వివాహాలు 

ఉదయం  9- 57  నిమిషాల నుండి. 10- 55 నిమిషాల మిథున లగ్నం లో 20  సామూహిక వివాహాలు పంచభూతాల సాక్షిగా మాంగల్య ధారణ తో ఒక్కటయ్యారు. నూతన వధూవరులు బందువులు శ్రీ పూజ్యులు చే ఆశీర్వాదం పొందరు. చంద్ర శేఖర్ స్వాములు నిజ నంద స్వాముల వారు నూతన వ దూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు ఈ సామూహిక వివాహాలు లో టిడిపి నాయకులు ఉలి గాయ్య, శ్రీనివాస రెడ్డి, టిప్పు సుల్తాన్, సాయిబాబా శివ గౌడ్, మాజీ సర్పంచ్ కుమారుడు  సురేష్, వైసిపి నాయకులు ఎకంబ రెడ్డి తదితరులు హాజరై వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.అనంతరం మఠం పల్లకి ఉత్సవం లో పాటు వదూవరులను పుర వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ పూజ నిజాం అంద స్వాములవారికి అమృత హస్తముల చే ఉచ్చాయ  రథోత్సవం  నిర్వహించారు. మరియు గ్రామ ప్రజలు,భక్తులు తమ ఇష్టానుసారం తను,మను, ధనములు సమర్పించావలేయునని  చంద్రశేఖర్ స్వాముల వారు తెలిపారు.అనంతరం వధూవరులకు, బంధువులకు భోజన వసతులు కల్పించారు. బారీగా తరలి వచ్చి బసవ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రజలు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.

No comments:
Write comments