మే 27 నుండి జూన్ 2వ తేదీ వరకు 'శుభప్రదం'

 

7, 8, 9 తరగతులవారికి ప్రవేశం
తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం తిరుపతిలో 7 కేంద్రాలు
తిరుమల, మే 23, (globelmedianews.com
భారతీయ సనాతన ధర్మంలోని మానవీయ నైతిక విలువలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు టిటిడి ప్రతి ఏడాదీ వేసవిలో శుభప్రదం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మే 27 నుండి జూన్ 2వ తేదీ వరకు 7, 8, 9 తరగతుల విద్యార్థులకు శుభప్రదం శిక్షణ తరగతులను నిర్వహించనుంది.2012వ సంవత్సరం నుండి టిటిడి ఈ తరగతులను నిర్వహిస్తోంది. ఇందులో శ్రీవేంకటేశ్వరుని జీవితచరిత్ర, భగవద్గీత, సనాతన ధర్మపరిచయం, రామాయణ, భారత, భాగవత సందేశం, ఆర్ష వాఙ్మయం, వ్యక్తిత్వ వికాసం, భారతీయ కుటుంబ జీవనం, పండుగలు-పరమార్థాలు, ఆచారాలు - వైజ్ఞానిక దృక్పథం, మాతృభాష, విద్య, దేశభక్తి తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు.


మే 27 నుండి జూన్ 2వ తేదీ వరకు 'శుభప్రదం'

తిరుపతిలోని 7 కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 3,500 మంది విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేపట్టారు. హెచ్డిపిపి ప్రోగ్రాం అసిస్టెంట్, జిల్లా ధర్మప్రచార మండలి సభ్యులు, టిటిడి కల్యాణమండపాలతోపాటు టిటిడి వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. పూర్తి చేసిన దరఖాస్తులను తిరిగి ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రోగ్రాం అసిస్టెంట్లకు సమర్పించాల్సి ఉంటుంది. తిరుపతిలోని విద్యార్థులు స్థానిక అన్నమాచార్య కళామందిరంలోని హెచ్డిపిపి కో-ఆర్డినేటర్ వద్ద దరఖాస్తులు పొంది తిరిగి అక్కడే సమర్పించవచ్చు. 
తిరుపతిలోని టిటిడి విద్యాసంస్థలైన ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్పిడబ్ల్యు డిగ్రీ కళాశాల, ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్పిడబ్ల్యు జూనియర్ కళాశాల, ఓరియంటల్ కళాశాల, ఎస్పిడబ్ల్యు పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులకు మెటీరియల్, నిష్ణాతులతో బోధనతోపాటు భోజన వసతి, బస కల్పిస్తారు.

No comments:
Write comments