మహారాష్ట్రలో మావోయిస్టుల ఘాతుకం…గచ్చిరోలిలో 36 వాహనాల దగ్ధం

 

మాలేగావ్  మే 1,  (globelmedianews.com)  
మహారాష్ట్రలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గడ్చురోలి ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం తీసుకొచ్చిన వాహనాలకు నిప్పుపెట్టారు. దాదాపూర్ పరిధిలోని కురకేదా తాలూకాలో ఈ ఘటన చోటుచేసుకుంది.  పురాందా-మాలేగావ్-యెర్కద్ జాతీయ రహదారి నిర్మాణ పనులను అమర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థ చేస్తోంది. ఈ కంపెనీకి దాదాపూర్లో  ప్లాంట్ ఉంది. 


మహారాష్ట్రలో మావోయిస్టుల  ఘాతుకం…గచ్చిరోలిలో 36 వాహనాల దగ్ధం

రోడ్డు నిర్మాణం కోసం వినియోగిస్తున్న వాహనాలను ఈ ప్లాంట్లోనే నిలిపి ఉంచారు.  దాదాపు 150 మంది నక్సలైట్లు ప్లాంట్లోకి చొరబడి వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 36 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వీటిలో జెనరేటర్లు, పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు, రోడ్డు రోలర్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తాము ఈ చర్యకు పాల్పడినట్లు ఘటనాస్థలంలో నక్సలైట్లు కరపత్రాలు వదిలివెళ్లారు. కాగా.. ఘటనలో దాదాపు రూ. 10కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

No comments:
Write comments