విశ్రాంత న్యాయమూర్తి సుభాషన్ రెడ్డి కన్నుమూత

 

హైదరాబాద్, మే 1,  (globelmedianews.com
విశ్రాంత జస్టిస్ సుభాషన్ రెడ్డి  అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 76 ఏళ్లు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ)లో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత నెలరోజులుగా  జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఏఐజీలో చికిత్స పొందుతున్నారు. ఆయన గతంలో మద్రాస్,  కేరళ హైకోర్టుల చీఫ్ జస్టిస్,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల కమిషన్ తొలి చైర్మన్,  లోకాయుక్త చైర్మన్ గానూ సుభాషన్ రెడ్డి  సేవలందించారు.  


విశ్రాంత న్యాయమూర్తి సుభాషన్ రెడ్డి కన్నుమూత

సుభాషన్ రెడ్డి  భౌతికకాయాన్ని అవంతి నగర్ లోని  ఆయన నివాసానికి తరలించారు. ఈ సాయంత్రం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.  సుభాషన్ రెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషన్  రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు .ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  అధికార లాంఛనాలతో జస్టిస్ సుభాషన్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని సి ఎస్ ను ముఖ్యమంత్రి  ఆదేశించారు

No comments:
Write comments