మహిళా పోలీసును హతమార్చిన జవాను

 

సంగారెడ్డి, మే 1,  (globelmedianews.com
సదాశివ పెట్ మండలం, కొనపూర్ శివారు లో మహిళా కానిస్టుబుల్  దారుణ హత్య కు గురయింది.  మృతురాలు మందాకినిరామచంద్రపురం పోలీసు స్టేషన్ లో పనిచేస్తోంది. ఏప్రిల్ 29 నాడు సాయంత్రం మందాకిని డ్యూటీ దిగింది.  ఆ తరువాత ఆమె  సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. దాంతో ఆమె తండ్రి పోలీసులకు పిర్యాదు చేసాడు. అనుమానితుడు అయిన హత్నూర పీఎస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ప్రకాష్ ను రామచంద్రపూరం  పోలీసులు విచారించారు. 


మహిళా పోలీసును హతమార్చిన జవాను 

మందాకినిని తానే హత్య చేసి సదాశివ పేట్ మండలం కోన పూర్ గ్రామ శివారు లో పెట్రోల్ పోసి తగులపెట్టనని ఒప్పుకున్నాడు. ఈ ఇద్దరికి  చాలా సంవత్సరాలు గా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరూ సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే వారు. ఆ సమయంలో ఇద్దరి మధ్యా పరిచయం ప్రేమగా మారి కొనసాగింది. కొన్నాళ్ల తరువాత హత్నూర్ పోలీస్ స్టేషన్కు ప్రకాశ్, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కు మందారికలు బదిలీ అయ్యారు. వేర్వేరు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నా ఇద్దరి మధ్యా ప్రేమ కొనసాగింది. అప్పుడప్పుడూ కలిసి బయటకు వెళ్లేవారు. నిందితుడు ప్రకాష్ కు ఇంతకు ముందే వివాహం జరిగింది. మందాకిని పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీయగా అమ్మాయిని వదిలించుకోవడానికి ఈ దారుణానికి ఒడిగట్టాడని తేలింది.  

No comments:
Write comments