తుపాన్ హెచ్చరిక

 

అమరావతి, మే 01 (globelmedianews.com)  
విశాఖపట్నం తీరం నుంచి  396  కిలోమీటర్ల దూరంలో కేంద్రీ కృతమైన ఫోనీ తుపాన్ ఉత్తర దిశగా  పయనిస్తున్నదని  రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)  సూచించింది. ఈనెల 3వ తేదీ సాయంత్రానికి ఇది ఓడిశా లో పారదీప్ వద్ద తీరం తాకనుంది. ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున అలలు  ఎగసిపడుతున్నాయి. ఆరు  మీటర్ల ఎత్తు వరకు కెరటాలుఎగసిపడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి.


తుపాన్ హెచ్చరిక

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీచే అవకాశం వుంది. గంటకు 100 నుంచి 110 కిలో మీటర్లతో బలమైన గాలులు వీస్తాయి. తీవ్ర ప్రభావమున్న మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి  సారించాయి. శ్రీకాకుళం: గార, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పొలాకి, నందిగం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం,  విజయనగరం జిల్లాలో భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ  ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తుపాన్ తీరం దాటడానికి ముందు ఎవరూ బయటకు రాకూడదని సూచించింది. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలి వాహనాలపైన బయట సంచరించకూడదని హెచ్చరించింది. 

No comments:
Write comments