ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

 

నాగర్ కర్నూలు, మే 1,  (globelmedianews.com)  
నాగర్ కర్నూలులోని మార్కెట్ యార్డులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం పర్యటించారు. అకాలవర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించారు.  ఈ కార్యక్రంలో ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు కుడా పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ  తడిసిన దాన్యాన్ని కొంటాం.  రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  ఒట్టి ధాన్యం ముందు కొనండి. - తడిసింది ఆరిన తరువాత కొనండి.  మద్దతుధరలో ఎలాంటి తేడా ఉండదని అన్నారు. 


ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

గన్నీ బ్యాగుల కొరత రానివ్వకండి.  బంగ్లాదేశ్ లో ఈ ఏడాది జూట్ ఉత్పత్తి తగ్గడంతో ఇబ్బందులు ఉన్నాయి.  వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.  కొన్న ధాన్యం వెంటనే తరలించాలి.  వాహనాల కాంట్రాక్ట్ యజమానులు ఆలస్యం చేయవద్దు.  అధికారులు జిల్లాల వారీగా కాంట్రాక్టర్ల   వద్ద ఉన్న వాహనాల లెక్కలు తీసుకోండని సూచించారు. వాహనాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయం ఆలోచించండి.  ట్రక్కుల కాంట్రాక్టర్లు టెండర్లు వేయడమే కాదు, వాహనాలను అందుబాటులో ఉంచండి. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.   రైతు సంతోషంగా ఉంటేనే మనందరం బాగుంటామని అన్నారు.  తూకాలలో తేడా వచ్చినా, ఎక్కువ తరుగు తీసినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. 

No comments:
Write comments