పురందరేశ్వరీకి దక్కని డిపాజిట్

 


విశాఖపట్టణం, మే 24  (globelmedianews.com)
అంచనాలు తారుమారు అయ్యాయి. అనుకున్నది ఒక్కటి, జరిగింది మరొకటి. కచ్చితంగా గెలుస్తాడని అంతా అనుకున్నారు. ఆయనపై హోప్స్ పెరిగాయి. కానీ ఓడిపోయారు. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఏపీలో అందరి దృష్టి ఆకర్షించిన ఆయనే విశాఖ లోక్ సభ జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. విశాఖ లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన లక్ష్మీనారాయణ మూడో స్థానానికి పరిమితమయ్యారు. నిజాయతీపరుడైన పోలీసు ఆఫీసర్ గా, సీబీఐ మాజీ జేడీగా గుర్తింపు పొందిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చారు. జనసేనలో చేరి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.విశాఖ నుంచి పోటీచేయడంతో ఆసక్తి నెలకొంది. 


పురందరేశ్వరీకి దక్కని డిపాజిట్
అందరి దృష్టి పడింది. లక్ష్మీనారాయణ గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విశాఖ నగర ఓటర్ల నుంచి ఆయనకు మంచి మద్దతే లభించింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ప్రభంజనంతో లక్ష్మీనారాయణకు ప్రతికూలంగా మారింది. పట్టణ ఓటర్ల నుంచి మంచి స్పందన దక్కినా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చతికిలపడ్డారు. దీనికి కారణం గ్రామస్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడమే. సంస్థాగత లోపంతో ఆయనకు ఓట్లు పడలేదు. దీంతో లక్ష్మీనారాయణ మూడో స్థానానికే పరిమితమయ్యారు.విశాఖ లోక్‌సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ విజయం సాధించారు. ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆఖరి రౌండ్‌ వరకూ ఉత్కంఠగా సాగింది. తొలిరౌండ్‌ నుంచి వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ  స్వల్ప ఆధిక్యం సాధించినప్పటికీ.. 15 రౌండ్ల అనంతరం టీడీపీ అభ్యర్థి భరత్‌ ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత రౌండ్ల లెక్కింపు నెమ్మదిగా సాగింది. దీంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 20వ రౌండ్‌ నుంచి వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ ఆధిక్యం ప్రదర్శించారు. చివరికి 3వేల 723 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌పై విజయం సాధించారు. ఇక, విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పురందేశ్వరికి డిపాజిట్ కూడా దక్కలేదు. 2009 ఎన్నికల్లో విశాఖ నుంచి కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించిన ఆమె ఈ ఎన్నికల్లో మాత్రం స్వల్ప ఓట్లు దక్కించుకున్నారు.

No comments:
Write comments