పార్టీలలో కట్టప్పలు పైచర్చలు

 

విజయవాడ, మే 6, (globelmedianews.com)
అన్ని అనుకూలించాయి. పార్టీ టిక్కెట్ సాధించాం. లక్ష్యం ప్రకారం డబ్బు ఖర్చు పెట్టాం. ప్రత్యర్థిపై అస్త్ర శాస్త్రాలన్నీ సంధించాం. ఇన్ని అనుకూలతలు వున్నా ఎక్కడో గెలుపుపై అనుమానం కొడుతుంది. ఎందుకంటే వెన్నంటే వుంటూ వెన్నుపోటు పొడిచిన కట్టప్పలు ఎవరన్నా ఉన్నారా ? వారి వల్ల జరిగిన డ్యామేజ్ ఎంత ?ఈ లెక్కల్లో ప్రస్తుతం అన్ని పార్టీల్లోని అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎవరు పక్కనే ఉంటూ ద్రోహం చేశారనే లెక్కలు తీస్తున్నారు.ధన ప్రవాహంగా మారిన ఎన్నికల్లో నమ్మకస్థులు అనేమాట ప్రశ్నార్ధకమే. 


పార్టీలలో కట్టప్పలు పైచర్చలు

డబ్బుకు లోకం దాసోహం అనే పరిస్థితిలో ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయివాళ్ళు అనేది లెక్క కట్టడం అభ్యర్థులకు కత్తిమీద సామే. ఈ నేపథ్యంలో పోలింగ్ ముగిశాకా వస్తున్న రిపోర్ట్ లతో నీడను సైతం అభ్యర్థులు అనుమానిస్తున్నారు. పక్కనే వుంటూ కట్టప్పలా దెబ్బకొట్టేశారా ? వారి పోటు నుంచి ఎంతవరకు తప్పించుకుంటాం ? కోవర్ట్ లు గా ప్రత్యర్థి టీం వారు ఎవరు అనే ప్రశ్నలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డబ్బు ఓటరుకు కింది స్థాయి వరకు ఏ శాతం చేరి ఉంటుంది అనే గుబులు కూడా పలువురి అభ్యర్థుల్లో దడ పుట్టిస్తుంది. అనేక మంది తమ వద్ద డబ్బులు పంచేందుకు తీసుకుని ఓటర్లకు పంచకుండా సొంతం చేసుకున్నారన్న అనుమానాలు చాలా మంది నేతల్లో ఉన్నాయి. వాటిని సూక్ష్మస్థాయిలో పరిశీలించేపనిలో పడ్డారు తమ్ముళ్లు. ఈ అనుమానాలు అన్నీ పటాపంచలు కావాలంటే మాత్రం మరో రెండున్నర వారాలు వేచి చుడాలిసిందే.

No comments:
Write comments