వారసులకు నో చాన్స్

 


విజయవాడ, మే 24  (globelmedianews.com)

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కొత్త రక్తం ఉరకలేసింది. మునుపెన్నడూ లేనట్లుగా పెద్దసంఖ్యలో రాజకీయ వారసులు అరంగేట్రం చేశారు.అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ ప్రధాన పార్టీల నుంచి సీనియర్ నేతల వారసులు రంగంలోకి దిగారు.కొందరు సీనియర్ నేతలు ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకుని తమ కుమారులను పోటీకి నిలపగా.. మరికొందరు మాత్రం తాము పోటీలో ఉంటుండగానే సంతానాన్నీ ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకొచ్చారు.ఏపీలో వైసీపీ జ‌గ‌న్ సృష్టించిన జ‌న సునామీలో టీడీపీ దిగ్గ‌జ‌నాయ‌కుల వార‌సులు ఓట‌మి బాట‌ప‌డ్డారు. రాష్ట్రంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం ప్రారంభ‌మైన నాటి నుంచి కూడా టీడీపీ టెకెట్‌పై పోటీ చేసిన అతిర‌థ‌మ‌హార‌థుల త‌ప‌యులు ఓట‌మి అంచున వేలాడారు. ప్ర‌తి రౌండ్‌లోనూ వెనుక‌బ‌డ్డారు. ముఖ్యంగా సానుభూతి ప‌వ‌నాలు జోరందుకుంటాయ‌ని, గెలుపు ఖాయ‌మ‌ని అనుకున్న చోట కూడా ప్ర‌జ‌లు వైసీపీనే ఆద‌రించారుఈసారి అసెంబ్లీ బరిలో ఉన్న రాజకీయ వారసుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ది.


వారసులకు నో చాన్స్
ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడడం ఇదే తొలిసారి. మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన ప్రజల ముందుకు ఓట్ల కోసం వెళ్లడం ఇదే ప్రథమం.గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఓడిపోయారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఏపీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ ఓటమిని చవి చూశారు. ఆయనపై వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ గెలుపొందారు. 5వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి అఖరికి మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న నారా లోకేశ్... గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా బలమైన ప్రత్యర్థి కావడంతో నారా లోకేశ్‌కు ఓటమి తప్పలేదు. మొదట్లో ఆళ్లకు గట్టి పోటీ ఇచ్చినట్టు కనిపించిన లోకేశ్... ఆ తరువాత ఆధిక్యం విషయంలో వెనుకబడుతూ వచ్చారు. మంత్రి అఖిలప్రియకు ఆళ్లగడ్డ ప్రజలు గట్టి షాక్‌ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమెను ఓడించారు. అఖిలప్రియ పోటీ చేసిన ఆళ్లగడ్డ స్థానంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గంగుల బీజేంద్రరెడ్డి గెలుపొందారు. అయితే ఈ ఓటమికి ఆమె వ్యవహార శైలే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం, అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆమె ప్రవర్తన తీరు నచ్చక పలువురు నేతలు కూడా టీడీపీని వీడారు. ఇవన్నీ కూడా ఆమె ఓటమిలో కీలక భూమిక పోషించాయి.అనంతపురం జిల్లాలో రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ తల్లి సునీత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి పరిటాల రవి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ‌కు తిరుగులేద‌ని అనుకున్న ప‌రిటాల వ‌ర్గం కూడా కుప్ప‌కూలింది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించిన ప‌రిటాల సునీత తాజా ఎన్నిక‌ల్లో త‌న సీటును త్యాగం చేసి మ‌రీ త‌న కుమారుడికి అవ‌కాశం క‌ల్పించారు.నామినేష‌న్ డే నుంచి చాక‌చ‌క్యంగా ప్ర‌చారం చేసిన ప‌రిటాల శ్రీ‌రాం.. ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకున్నారు. దీంతో ప‌రిటాల శ్రీ‌రాం విజ‌యం ఖాయ‌మ‌ని, ల‌క్ష‌కు పైగానే మెజారిటీ ఆయ‌న సొంతం చేసుకుంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు. ఈ నేప‌థ్యంలో కోట్ల‌కుకోట్లు బెట్టింగులు కూడా క‌ట్టారు. అయితే, తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం శ్రీ‌రాంను కుంగ‌దీశాయి. పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు మొదటిసారి ఎన్నికల బరిలో దిగారు. ఆయన తండ్రి కేఈ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన డిఫ్యూటీ సీఎం త‌న‌యుడు కేఈ సుధీర్ కూడా ప‌రాజ‌యం పాలయ్యారుశ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీపడుతున్న గౌతు శిరీషకు ఇవే తొలి ఎన్నికలు. ఆమె తండ్రి గౌతు శ్యామసుందర శివాజీ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత పలాస నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు సోంపేట నుంచి శివాజీ అయిదుసార్లు విజయం సాధించారు.శివాజీ తండ్రి గౌతు లచ్చన్న కూడా సోంపేట నుంచి అయిదుసార్లు శాసనసభకు గెలిచారు.ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న శిరీష.. తన తాత, తండ్రిల వారసురాలిగా తొలిసారి ఎన్నికల క్షేత్రంలో దిగారు.టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషను వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు ఓడించారువిజయనగరం జిల్లాలో ఈసారి ఇద్దరు వారసులు తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి అదితి గజపతి రాజు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కుమార్తె. అశోక్ విజయనగరం శాసనసభా స్థానం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో పలుమార్లు మంత్రిగానూ పనిచేశారు. 2014లో విజయనగరం నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్రంలోనూ మంత్రిగా పనిచేశారు. 2004లో తప్ప అన్నిసార్లూ గెలుస్తూ వచ్చిన విజయనగరంలో సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు వైఎస్సార్‌సీపీ నేత కోలగట్ల వీరభద్ర స్వామి చేతిలో ఓడారు. .. కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియ‌ర్ నేత పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజు కుమార్తె అదితి గ‌జ‌ప‌తిరాజు కూడా ఓడిపోయారు. ఇలా మొత్తంగా వార‌సుల‌ను రంగంలోకి దింపిన టీడీపీ హేమా హేమీలు ఓట‌మిని చూసి జీర్ణించుకోలేని ప‌రిస్థితి నెల‌కొన‌డం గమ‌నార్హం.ఇదే జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున కిమిడి నాగార్జున పోటీ చేస్తున్నారు. నాగార్జున తల్లి కిమిడి మృణాళిని 2014లో ఈ నియోజకవర్గం నుంచే గెలిచి కొద్దికాలం చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. నాగార్జున తండ్రి గణపతి రావు కూడా 1999లో శ్రీకాకుళం జిల్లా ఉణుకూరు(డీలిమిటేషన్ తరువాత రద్దయింది) శాసనసభ స్థానం నుంచి గెలిచారు. గణపతిరావు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, మంత్రి కళావెంకటరావుకు స్వయానా సోదరుడు.విశాఖ జిల్లాలో అరకు అసెంబ్లీ స్థానానికి పోటీపడుతున్న టీడీపీ అభ్యర్థి కిడారి శ్రావణ్ కుమార్‌కు ఇవే తొలి ఎన్నికలు. శ్రావణ్ తండ్రి సర్వేశరరావు 2014లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2018లో మావోయిస్టులు ఆయన్ను హతమార్చారు. అనంతరం కొద్దికాలానికి శ్రావణ్‌కు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు.తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి భవానీకి ఇవే తొలి ఎన్నికలు. ఆమె కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమార్తె. భవానీ సోదరుడు రామ్మోహననాయుడు 2014లో శ్రీకాకుళం ఎంపీగా గెలిచారు. చిన్నాన్న అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. భవానీ మామ ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో  ఆదిరెడ్డి భవానీ గెలిచారుకృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్‌కు ఇది తొలి ఎన్నికలు. ఆయన తండ్రి నెహ్రూ గతంలో మంత్రిగా పనిచేశారు. అవినాష్ నియోజకవర్గంలో తన తండ్రికి ఉన్న పరిచయాలు.. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయంటున్నారు. సామాజిక సమీకరణాలు.. తెలుగు యువత అధ్యక్షుడిగా సేవలు.. స్థానిక సమస్యలపైపోరాటం వంటి అంశాలు కలిసొస్తాయని భావించారు...కానీ ఆశించిన ఫలితం మాత్రం రాలేదు.చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గాలి భానుప్రకాశ్ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారుడు. ముద్దుకృష్ణమ నాయుడి మరణంతో ఈ ఎన్నికల్లో టీడీపీ ఆయన కుమారుడికి సీటిచ్చింది . చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ సీనియ‌ర్ నేత‌, దివంగ‌త గాలి ముద్దుకృష్ణ‌మ త‌న‌యుడు గాలి భానుప్ర‌కాశ్ రెడ్డి గెలిచి తీర‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, తాజా ఫ‌లితాల్లో ఆయ‌న హోరా హోరీగా పోటీ ఇచ్చినా.. చివ‌రికి ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా రెండో సారి పోటీ చేసిన ఎమ్మెల్యే రోజా విజ‌యం సాధించారు. .గంగాధర నెల్లూరు నుంచి టీడీపీ తరఫున బరిలో నిలిచిన హరికృష్ణకు ఇవే తొలి ఎన్నికలు. ఆయన తల్లి కుతూహలమ్మ అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికీ ఇవే తొలి ఎన్నికలు. ఆయన తండ్రి బొజ్జల గోపాలరెడ్డి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. లోక్ స‌భ బ‌రిలో దిగిన తెలుగుదేశం నేత‌ల వార‌సులు సైతం ఈసారి ఓడిపోయారు. అనంత‌పురంలో జేసీ దివాక‌ర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, రాజ‌మండ్రిలో ముర‌ళీమోహ‌న్ కోడ‌లు మాగంటి రూప‌, విశాఖ‌ప‌ట్నంలో బాల‌కృష్ణ అల్లుడు భ‌ర‌త్ ఓట‌మి పాల‌య్యారు. ఈ స్థానాల్లో ఈసారి వార‌సులను నిల‌బెట్ట‌కుండా మ‌ళ్లీ వారే నిల‌బడి ఉంటే గెలుపు అవ‌కాశాలు కొంత మెరుగ్గా ఉండేవి. పైగా వైసీపీ హ‌వాను అంచ‌నా వేయ‌లేక ఈసారే వార‌సుల‌ను తెర‌పైకి తెచ్చి వారికి మొద‌టి ఓట‌మి రుచి చూపించారుకర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన తండ్రి టీజీ వెంకటేశ్ ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ అభ్యర్థుల్లోనూ తొలిసారి పోటీ చేస్తున్న వారసులున్నారు.అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తున్న గంటి హరీశ్ మాధుర్‌కు ఇవి తొలి ఎన్నికలు. లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీశ్.విశాఖ పార్లమెంటు స్థానం నుంచి బరిలో నిలుస్తున్న టీడీపీ నేత భరత్ గతంలో ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసిన ఎంవీవీఎస్ మూర్తి మనవడు.అనంతపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డికి ఇవి తొలి ఎన్నికలు. ఆయన తండ్రి దివాకరరెడ్డి ఎంపీగా, రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు.ఇక‌, వార‌సులు ఎక్కువ‌గా రంగంలోకి దిగిన అనంత‌పురంలోనూ ఇదే ప‌రిస్థితి ఏర్ప‌డింది. దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాలుగా ఇక్క‌డి తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్కం తిప్పిన జేసీ దివాక‌ర్ రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డిల హ‌వాకు తాజా ఎన్నిక‌లు అడ్డుక‌ట్ట వేశాయి. ఇక్క‌డ నుంచి ప్ర‌భాక‌ర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాజా ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. అయితే ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అనుకున్నా.. తాజా ఫ‌లితాల్లో చ‌తికిల ప‌డ్డారు. ఇక‌, అనంత‌పురం ఎంపీ స్థానం నుంచి బ‌రిలో నిలిచిన దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు ప‌వ‌న్ కుమార్ రెడ్డి కూడా ఓట‌మి అంచున ఊగిస‌లాడుతున్నారు.రాజమండ్రి లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థి మాగంటి రూప ఎంపీ మురళీమోహన్‌కు స్వయాన కోడలు. రెండు సార్లు ఎంపీగా  గెలిచిన మురళీమోహన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

No comments:
Write comments