కాలువల ప్రక్షాళనకు శ్రీకారం

 

విజయవాడ మే 2, (globelmedianews.com)
గురువారం నాడు విజయవాడ రామలింగేశ్వరనగర్ వద్ద నేను సైతం కృష్ణమ్మ సేవలో కార్యక్రమానికి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా బందరు కాలువ ను అధికారులు, ప్రజలు పరిశుభ్రం చేసారు. ఈ కార్యక్రమంలో  పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, జాయింట్ కలెక్టర్ లు కృతికా శుక్లా, బాబూరావు, మున్సిపల్ కమిషనర్ రామారావు ఇతర అధికారులు పాల్గోన్నారు.  కాలువల్లో చెత్త చెదారం వేయకుండా  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ అధికారులు చేయించారు. మున్సిపల్ కమిషనర్ రామారావు మాట్లాడుతూ విజయవాడ లోని మూడు కాలువలను ప్రక్షాళన చేసేందుకు శ్రీకారం చుట్టాం. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నాం. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. అనారోగ్యం కూడా దరి చేరదు. కాలువల్లో చెత్త వేయడం వల్ల నీటి పారుదల కూడా నిలిచిపోయింది. 


కాలువల ప్రక్షాళనకు శ్రీకారం

తడి చెత్త, పొడి చెత్త లను విడివిడిగా ఉంచి శానిటేషన్ సిబ్బంది కి ఇవ్వాలని అన్నారు. కాలువల సంరక్షణకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు. పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ నదులు, కాలువల్లో నీరు బాగా పారితేనే.. మన ఆరోగ్యానికి మంచిదని అన్నారు. నదులు, కాలువల సంరక్షణ ను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గా భావించాలి. ఇటువంటి మంచి కార్యక్రమం లో మా పోలీస్ శాఖ భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని అన్నారు. 18సంవత్సరాల క్రితం కొడాయ్ కెనాల్ లో ఓ వ్యక్తి కాలువల్లో  ప్లాస్టిక్ వస్తువులను క్లీన్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు అదే తరహాలో కలెక్టర్ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజలను భాగస్వామ్యం చేశారు.  పోలీసులు కూడా ఈ మంచి కార్యక్రమం లో ఎన్ని రోజులైనా పాల్గొంటారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కృష్ణానదిని నేను సైతం అంటూ అందరూ తరలి రావడం చాలా సంతోషంగా ఉంది. డెల్టా ఏరియాలో ఇరవై మండలాలకు ఈ కాలువల ద్వారా నీరు వెళుతుంది. వీటిలో చెత్తా, చెదారం వేయడంతో నీటి సరఫరా నిలిచిపోయి కింద ప్రజలు సాగు, తాగు నీటి కోసం కష్టాలు పడుతున్నారని అన్నారు. తడి చెత్త, పొడి చెత్త  వేరుగా వేయాలని  ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. మాంసాహార ఉత్పత్తుల విక్రయదారులు కూడా కాలువల్లోనే వ్యర్ధ పదార్ధాలను వేస్తున్నారని అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి నేను సైతం కృష్ణమ్మ సేవలో భాగస్వామ్యం చేస్తాం. ఇక నుంచి ప్రతి నెలలో రెండు రోజులు అన్ని వర్గాల ప్రధాన ప్రజలు ఈ మంచి కార్యక్రమం లో భాగస్వామ్యులు కావాలని అన్నారు.

No comments:
Write comments