అన్నదాతలకు అండగా కేంద్రం

 

ఏలూరు మే 13, (globelmedianews.com)
అన్నదాతకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయాధార పశ్చిమ జిల్లాలో సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు జరగనుంది. అయితే హామీ లేని రుణాలు ఇవ్వాలని నాబార్డు, రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నా.. ఇప్పటికైనా దానిని అమలులోకి తీసుకు రావడం సంతోషదాయకమని రైతులు, రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హామీ లేకుండా రూ.ఒక లక్ష రుణం ఇవ్వడంతో పాటు ప్రస్తుతమున్న నిబంధనల్లో స్వల్పమార్పులు చేస్తే రైతుకు మరింత లాభం చేకూరుతుందని వారు చెబుతున్నారుతొంభై శాతమున్న చిన్న, సన్నకారు రైతులకు హామీ లేకుండానే రూ.లక్ష రుణం ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులు ప్రయోజనం 
పొందనున్నారు. 


అన్నదాతలకు అండగా కేంద్రం

గతంలోని కిసాన్‌ రుణ కార్డులను క్రమబద్ధీకరించడంతో పాటు పాతబకాయిలున్నా కొత్తగా రుణం తీసుకునే వెసులుబాటు కల్పించనుంది. తద్వారా అత్యవసర వేళల్లో దళారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా నేరుగా బ్యాంకులో సరళమైన పద్ధతిలో రుణం  పొందడానికి వీలు ఏర్పడింది. .జిల్లాలో సాగు భూమి 16 లక్షల ఎకరాలు ఉండగా.. 6.71 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. వరి పంట ఆరు లక్షల ఎకరాల్లో సాగవుతోంది. సాగుచేస్తున్న రైతులు 5.08 లక్షల మంది  ఉన్నారు. ఇందులో 90 శాతం మంది వరకు అంటే సుమారు 4 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులు ఉన్నట్లు అంచనా. జిల్లాలో ఆయా రైతులకు ఖరీఫ్‌, రబీ సీజన్లలో కలిపి పంట రుణం కింద గతేడాది రూ.6,526 కోట్లు అందించారు. 2017-18లో రూ.6,800 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా సన్న, చిన్నకారు రైతులకు హామీ లేకుండా రూ.ఒక లక్ష పంట రుణం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అంటే సన్న, చిన్నకారు రైతులకే రూ.4 వేల కోట్ల వరకు గరిష్టంగా రూ.ఒక లక్ష చొప్పున పంట రుణం అందించే వీలుంది. ప్రస్తుతం ఎకరం పొలానికి రెండు పంటలకు కలిపి రూ.50 వేల వరకు రుణం అందిస్తున్నారు. అయితే రుణం ఇవ్వాలంటే సవాలక్ష నిబంధనలు, హామీలు అడుగుతున్నారు. 

No comments:
Write comments