స్పందన లేని తెరాస ప్రభుత్వం

 

హైదరాబాద్, మే 2, (globelmedianews.com)
ఇంటర్ విద్యార్థుల కు జరిగిన అన్యాయం, విద్యార్థుల మరణం పైన స్పందించలేదని రాష్ట్ర ప్రభుత్వం పైన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మార్కులు తారుమారు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నారు. బందులు, ముట్టడి చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోతే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలి విద్యార్థుల సమస్య పైన పోరాడుతున్న హనుమంతరావు. ఒక కుర్ర కుంక సీనియర్ నేత విహెచ్ ను బఫున్ అంటున్నాడు. రాష్ట్రంలో ఎంత కండ కావర బలుపు పాలన కొనసాగుతుందో అర్తం చేసుకోవాలని అన్నారు. వీళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎంసెట్ పేపర్ లీక్ కుంభకోణం విషయం 3 సంవత్సరాలు అయినా ఇంతవరకు తేలలేదు. ఎంసెట్ పేపర్ లో నిందితులుగా చెప్పబడుతున్న రావత్,  కమలేష్ అనుమానాస్పద మృతి చెందారు. మరి ఆరోజు మాగ్నటిక్ ఇన్ఫోటెక్ సంస్థ పైన ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. కేటీఆర్ ఫ్రెండ్ మామ సంస్థ అయిన మాగ్నటిక్ ఇన్ఫోటెక్ పైన ఎందుకు చర్యలు లేవు. 20 సంవత్సరాలుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ సంస్థను తప్పించి ఎందుకు కేటీఆర్ స్నేహితుల ప్రైవేట్ సంస్థ గ్లోబరీనాకు ఎందుకు టెండర్ ఇచ్చారని అడిగారు. 


స్పందన లేని తెరాస ప్రభుత్వం

మాగ్నటిక్ ఇన్ఫోటెక్ రావు, గ్లోబరీనా రాజు గారు వెనక యువరాజు లేడా అని అడుగుతున్నానని అన్నారు. 2017 లో కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ శాఖ నుండి ఒక ప్రతినిధి పాల్గొని గ్లోబరీనాకు టెండర్ ఇచ్చారు. ఈ టెండర్ ప్రక్రియలో స్వయంగా కేటీఆర్ ఐటీ శాఖ నుండి అధికారి పాల్గొన్నాడు ప్రభుత్వం ఇచ్చిన త్రిసభ్య కమిటీ కూడా గ్లోబరీనా తప్పిదాలతో ఈ తప్పిదం జరిగింది అని నివేదిక ఇచ్చింది. గ్లోబరీనా పైన పెడితే కేటీఆర్ బావమరిది,ఇంకా స్నేహితులు లోపలికి వెళ్లవాలిసి వస్తుంది అందుకే కేసులు పెట్టడం లేదు. కేటీఆర్ నిజంగా కల్వకుంట్ల కుటుంబం అయితే కోర్టుకు వెళ్ళాలి. మాగ్నటిక్ ఇన్ఫోటెక్ లో ,గ్లోబరీనా లో,జరిగిన అక్రమాలు నేను నిరూపిస్తానని అన్నారు. నూనూగు మీసాల విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే....శవాలై ఇంటి ముందు ఉంటే తల్లి దండ్రులు పడే బాధ వర్ణనాతీతం. కనీసం ఒక్క శాసన సభ్యుడైన చనిపోయిన  విద్యార్థుల కుటుంబాలను పరమర్శించాడా. ప్రతి అంశం పైన మాట్లాడే  తనది కొడుకులు ఎందుకు మాట్లాడటం లేదు. ఆత్మహత్యల ను ప్రోత్సహించేలా  వ్యవహరించిన సంస్థలపై 304 ఏ,302 కేసులు పెట్టాలని అయన డిమాండ్ చేసారు.  చనిపోయిన విద్యార్థుల ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలి.  చనిపోయిన వ్యక్తులకు నష్టపరిహారం ఇవ్వడం ప్రభుత్వ విధి. దొంగతనం చేసిన  చేతికి మళ్ళి తాళం చెవి ఇచ్చారు. మళ్లీ  గ్లోబరీనాకు అవకతవలపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్లోబరీనాపై చర్య తీసుకోమని అన్ని రాజకీయ పార్టీలు,విద్యార్తి సంఘాలు డిమాండ్ చేస్తుంటే అడ్డుకుంటుంది రాజు కేసీఆర్,యువరాజు కేటీఆర్ అని రేవంత్ ఆరోపించారు. కేటీఆర్ గేటు ముందు ఉండే ఒక  కుక్క మాట్లాడుతూ నన్ను రాజకీయ ఉగ్రవాది అంటున్నాడు ఈ రాష్ట్రంలో అసలైన ఆర్థిక ఉగ్రవాదులు టెర్రరిస్టులు మీరు టీఆరెస్ నాయకులు. మాగ్నాటిక్ ఇన్ఫోటెక్, గ్లోబరీనా పైన బహిరంగ చర్చకు నేను సిద్ధం. ..అక్రమాలు నిరూపించకుంటే మీరు వేసే శిక్షకు నేను సిద్ధమని అన్నారు.  అమరవీరుల స్తూపం వద్ద అయినా సరే, మీరు చెప్పే ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు సిద్ధం. 23 మంది విద్యార్థులు ప్రాణాలు పోయి వారి తల్లి దండ్రులు రోడ్డు మీదికి వస్తే కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ఇస్తుంది.  గ్లోబరీనాపై చర్య తీసుకునేవరకు,విద్యార్థులకు నష్టపరిహారం ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని అన్నారు. 

No comments:
Write comments