తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్రోక్తంగా ప్రారంభమైన వరుణజపం

 

తిరుపతి, మే 14 (globelmedianews.com)
ప్రకృతిమాతను ఆవాహన చేసుకొని వరుణదేవుని కృపాకటాక్షాలు రాష్ట్రంపైన, దేశంపైన విస్తారంగా ఉండి సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ టిటిడి తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం వరుణజపం(పర్జన్య శాంతి హోమం)ను శాస్రోక్తంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో  అనిల్కుమార్ సింఘాల్ దంపతులు, తిరుపతి జెఈవో  బి.లక్ష్మీకాంతం పాల్గొన్నారు.


తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్రోక్తంగా ప్రారంభమైన వరుణజపం  

కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి శుభాశీస్సులతో ఈ యాగాలను టిటిడి నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఆలయం వద్ద గల స్వామి పుష్కరిణిలో పలువురు రుత్వికులు వరుణ జపాన్ని ఆచరించారు. ఇందులో మొదటగా గణపతి పూజతో ప్రారంభమై, కరీరిష్టి పూజ,  పర్జన్య వరుణ జపం మంత్రాన్నిజపించి వరుణ దేవున్ని ప్రార్థించారు. ఈ యాగంలో 32 మంది రుత్వికుల 5 రోజుల పాటు పాల్గొంటున్నారు. ప్రతి రోజు ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు యాగ కార్యక్రమాలు జరుగుతాయి. కాగా మే 15వ తేదీ  గణపతి పూజ, నవగ్రహపూజ, ఋష్యశృంగ పూజ, మే 16న తీర్థ రాజ పూజ, శాంతి పూజ, మే 17న కారీరిష్టి పూజ, జల పూజ నిర్వహిస్తారు. మే 18వ తేదీ చివరి రోజున శాంతిహోమం, మహాపూర్ణాహుతితో వరుణ జపం ముగుస్తుంది. 

No comments:
Write comments