తుపాన్ తరువాత వరద ప్రమాదం

 

శ్రీకాకుళం, మే,03, (globelmedianews.com):
ఫోని తుఫాను ఆర్ టి జి ఎస్ ముందుగా సూచించిన విదంగానే గమనాన్ని సాగించిందని జిల్లా కలెక్టర్ జె నివాస్ వ్యాఖ్యానించారు.  తుఫాను జిల్లాను దాటింది. వర్ష పాతం కూడా అనుకున్న విధంగానే కురిసింది. కంచిలి మండలంలో 19 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఇచ్చాపురం మండలంలో 140 కిలోమీటర్ల కు పైగా వేగంతో గాలులు వీచాయి. సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న గ్రామాలు, ప్రమాదం కలుగుతుందని అంచనా వేసిన గ్రామాల నుండి ప్రజలను తరలించాం. ఇంత వరకు ఇచ్చాపురం లో 3 కచ్చా గృహాలు మినహా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు రిపోర్టు కాలేదు. స్తంభాలు కొన్ని వాలిపోయినట్లు సమాచారం అందుతుంది. 


తుపాన్ తరువాత వరద ప్రమాదం

వాటిని తక్షణం పునరుద్ధరణ చేస్తాం. రహదారిపై రాక పోకలకు అంతరాయం లేకుండా ఎక్కడైనా అవాంతరాలు ఉంటే వెంటనే తొలగిస్తాం. బృందాలకు ఇప్పటికే సూచనలు జారీ చేశాం. వరదలపై అప్రమత్తంగా వున్నామని అయన అన్నారు. తుఫాను అనంతరం వరదలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. బహుదా, వంశధార నదుల్లో ముఖ్యంగా వరదలు వస్తాయి. ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయరాదు. ఇసుక తవ్వకాలు లేదా ఇతర పనులకు నదుల్లోకి వెళ్లరాదు. ఆకస్మికంగా వరదలు వస్తాయి. నదీ తీరంలోని ప్రజలు ముఖ్యంగా మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా ఈ తుఫానులో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. సెల్ కంపెనీల అనుసంధానం చేశాం. తద్వారా ఒక సంస్థ టవర్ దెబ్బతిన్నా మరో సంస్థ టవర్ ద్వారా సిగ్నల్ పొందే అవకాశం కలిగింది. కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎటువంటి నష్టం కలుగలేదని కలెక్టర్ అన్నారు. 

No comments:
Write comments