తనకల్లులో రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి

 

అనంతపురం, మే 3 , (globelmedianews.com)
అనంతపురం జిల్లా కదిరి రూరల్ మండలం అయిన తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ సమీపంలో గోవిందు వారి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  కొక్కంటి క్రాస్ లో  తమ పనిని చూసుకొని  తిరిగి తమ సొంతవూరు  దాసర వాండ్ల పల్లి కి వెళ్తున్న వెంకటరెడ్డి, రమణప్పల  ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. వెంకట రెడ్డి (60) కి ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. 


తనకల్లులో రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి

మోకాలు నుండి  అరికాలు వరకు పూర్తిగా కాళ్లు దెబ్బతిని ఎముకలు బయటకి వచ్చాయి. ఇదే ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న రమణప్ప (50) కు స్వల్ప గాయాతో ప్రమాదం బారి నుండి బయటపడ్డాడు. రమణప్పను  చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. 

No comments:
Write comments