గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తా :భట్టి

 

ప్రజాపరిరక్షణ యాత్రకు గిరిజనుల ఘన స్వాగతం
పినపాక  మే 1 (globelmedianews.com)  
ప్రజాపరిరక్షణ యాత్రలో భాగంగా పినపాక నియోజకవర్గం అల్లపల్లి మండలం రాయపడు గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లుకు ఘన స్వాగతం పలికిన గిరిజనులు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి హక్కుల సాధనకోసం ప్రభుత్వాని ఫై పోరాటానికి విల్లును ఎక్కుపెట్టి  అందరిని ఆకర్షించారు.పోడు భూములను తమకు కేటాయించాలని గిరిజన సోదరులు భట్టి విక్రమార్కను కోరారు. 


గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తా :భట్టి

గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తానని, వారికి న్యాయం చేసేందుకు పోరాటాలు చేస్తానని అన్నారు.అనంతరంపార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి పెళ్లి ఒక చోట.. శోభనం ఒకచోట అన్నట్లు ఉంది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా 420లేనని భట్టి అన్నారు. ప్రజాపరిరక్షణ యాత్ర సందర్భంగా పినపాక నియోజకవర్గం మార్కోడులో ఆయన భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి రేగా కాంతరావుని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఓట్లు వేసిన ప్రజలను.. కేసీఆర్ కు అమ్మేసి కారు ఎక్కరని అన్నారు. ఇటువంటి మోసగాళ్లకు చట్టసభల్లో అవకాశం ఇవ్వకూడదని భట్టి అన్నారు.

No comments:
Write comments