రైతులను మోసగిస్తే కఠిన చర్యలు

 


మహబూబ్ నగర్ మే 18 (globelmedianews.com):
రైతులకు విక్రయించే విత్తనాలు, ఎరువుల విషయంలో మోసపూరితంగా వ్యవహరించే వ్యాపారులు, సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే గాకుండా, వారిని బ్లాక్ లిస్టులో పెడ్తామని జిల్లా ఎస్.పి. రెమా రాజేశ్వరి హెచ్చరించారు. రెక్కలు ముక్కలు చేసుకుని సమాజానికి ఆహారాన్ని సమకూర్చే రైతులు, శ్రమజీవులను మోసం చేయజూసేవారు జాతి విద్రోహులతో సమానమని, అటువంటివారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్.పి. తెలిపారు. రైతులను మోసగిస్తే కఠిన చర్యలు

అదనపు ఎస్.పి. ఎన్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో పోలీసు ప్రత్యేక బృందాలు నిరంతర నిఘాలో ఉన్నాయని, ప్రజలకు కూడ ఏమైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసు అధికారులకు తెలియజేయాలని ఎస్.పి.సూచించారు. రైతులు కూడ కొత్త వ్యక్తులు, ఇతర ప్రాంతాల నుండి వచ్చే వ్యాపారులను నమ్మి ఎరువులు, విత్తనాలు కొనరాదని, వ్యవసాయ శాఖ ధృవీకరించిన వ్యాపారుల వద్దనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయన్న విషయం గుర్తించాలని వివరించారు. పోలీసు శాఖ చేస్తున్న వివిధ సామాజిక సమస్యల ప్రక్షాళనలో ప్రజలు సహకరించాలని ఎస్.పి విజ్ఞప్తి చేశారు.

No comments:
Write comments