మహానాడు లేనట్టే...

 

విజయవాడ, మే 15, (globelmedianews.com)
ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాల కోసం అంతా వేచి చూస్తున్నారు. ఈ మధ్యలో నెలన్నర రోజులకు పైగా సమయం వుంది. అయినా కానీ తెలుగుదేశం పార్టీ కి అత్యంత ప్రధానమైన మహానాడు ఏర్పాట్లపై ఊసే లేదు. ముందుచూపు తో అన్ని నిర్ణయాలు తీసుకునే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈసారి మాత్రం మహానాడుపై సీరియస్ గా దృష్టి పెట్టక పోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రతి ఏటా మహానాడు కోసం మార్చి మాసంలోనే పాలిట్ బ్యూరో లో చర్చించి మే 27,28,29 తేదీలలో ఏమేం చేయాలన్నది కార్యాచరణ సిద్ధం అయిపోతుంది.మహానాడు కు జాతీయ నాయకులను ఎవరెవర్ని ఆహ్వానించాలనే అంశం నుంచి ప్రతిరోజు అతిధులకు వడ్డించాలిసిన మెనూ వరకు ముందే అన్ని ప్లాన్ ప్రకారం మార్చి, ఏప్రిల్ మాసాల్లో డిసైడ్ చేస్తారు. ఇక మే లో సభా వేదిక తయారు చేసుకునే సందడి ఇతర ఏర్పాట్లపై కార్యాచరణ ఉంటుంది. 


మహానాడు లేనట్టే...

పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తలపెట్టిన ఈ మహానాడు పసుపు దళానికి నాటి నుంచి నేటి వరకు పండగే. అయితే ఇప్పుడు మాత్రం ఆ సీన్ లేకపోవడం పై ఆ పార్టీలో ఫలితాలపై నెలకొన్న గందరగోళ పరిస్థితులను చాటి చెబుతుంది.పసుపు దళం అధిపతి ఒక పక్క జాతీయ రాజకీయాలు మరోపక్క ఎన్నికల కమిషన్ తో యుద్ధం వంటి వాటిల్లో చాలా బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో బాబుకు తీరికే లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల ఫలితాలు పార్టీకి చాలా ప్రధానమైనవి. అధికారం చేపడితే మూడు రోజుల్లో మహానాడు ధూం ధాం గా చేపట్టేయొచ్చు. కోల్పోతే క్యాడర్ కి ధైర్యం చెప్పేలా మహానాడును మార్చేయవచ్చు. ఈ అంచనాలతో ముందు ఎన్నికల ఫలితాలు చాలా ముఖ్యంగా భావించే మహానాడు ఏర్పాట్లపై బాబు దృష్టి పెట్టలేదని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం తిరిగి దక్కితే ఒకే…. లేకపోతే కనీసం జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలన్నది బాబు వ్యూహం గా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితాలు వెలువడిన తరువాత నాలుగు రోజులు ఇటు రాష్ట్రంలోనూ కేంద్రంలోను చాలా కీలకమైన తరుణం. ఈ నేపథ్యంలో మహానాడును వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నది టాక్. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా వుండబోతుందో చూడాలి

No comments:
Write comments