ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

 


కౌతాలం మే 28, (globelmedianews.com)
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 96 వ జన్మదిన వేడుకలు కౌతలం పార్టీ కార్యాలయం లో ఘనంగా జరుపుకున్నారు. మంగళ వారం ఎన్టీఆర్ జన్మ దిన సందర్బంగా పార్టీ కార్యాలయం లో మండల సీనియర్ నాయకులు ఉలి గాయ్య ఆధ్వర్యం లో  ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 


ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
ఎన్టీఆర్ జోహార్లు అని అమర్రహే అని నినాదాలు  పలికారు. తెలుగు దేశం నాయకులు చిత్ర పటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. తెలుగు దేశం పార్టీ బడుగు బలహీనవర్గాలకు చెందిన పార్టీ అని ఎన్టీఆర్ చేసిన సేవలు మరవనివి అని ఎల్లపుడూ ప్రజా సేవ లో ఉంటామని నాయకులు పలికారు. మండల నాయకులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ జన్మ దిన కార్యక్రమంలో  ఉలి గాయ్య, వెంకట పతి రాజు, అడివప్పాగౌడ్, రాజ నందు,సిద్దు, విరేశ్, రామలింగ, కార్యకర్తలు,అభిమానులు,పాల్గొన్నారు.

No comments:
Write comments