సీఎం, మంత్రులు యాగి చేస్తున్నారు

 

హైదరాబాద్, మే 2, (globelmedianews.com)
సిఎం నుంచి మంత్రుల వరకు సమీక్షలపై నానాయాగి చేస్తున్నారు. సమీక్షలను ఎవరో అడ్డుకుంటున్నట్లు డ్రామాలు ఆడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సమీక్షలు చేయలేదు. మీ అవినీతిని సిఎస్ అడ్డుకుంటే మంత్రులు,ముఖ్యమంత్రి యాగి చేస్తున్నారని వైకాప ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడ అవినీతికి సంభందించి ఆధారాలు దొరుకుతాయో వాటిని తుడిచిపెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఐదు సంవత్సరాలు సమస్యలపై దృష్టి పెట్టకుండా ఈరోజు మాత్రం మీకున్న అదికారాల గురించి మాట్లాడుతున్నారు. నిన్న సోమిరెడ్డి వెళ్లి సమీక్ష చేద్దామని వెళ్తే అదికారులు రాకపోతే మూడు గంటలసేపు డిస్కోడాన్స్ చేశాడని విమర్శించారు. మళ్లీ తర్వాత రోజు సైతం ప్రయత్నిస్తే అధికారులు రాలేదు.సిగ్గులేకుండా ఇంకా మాట్లాడుతున్నావు. రైతుల రుణాలను ఎందుకు మాఫి చేయలేదు.రైతు రుణబారాన్ని రెట్టింపు చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదు.  


సీఎం, మంత్రులు యాగి చేస్తున్నారు

స్వామినాధన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయలేదు.  నీవు వ్యవసాయమంత్రివి కాదు కిరాయిమంత్రివి. అత్యంత అసమర్ద వ్యవసాయశాఖమంత్రిగా నిలిచిన వ్యక్తి సోమిరెడ్డి. పంటలపై,గిట్టుబాటు ధరలపై ఏమాత్రం అవగాహన లేదు.ఏమి తెలుసు.రైతుభీమా,ఇన్ పుట్ సబ్సిడిలు,పంటల భీమా,విత్తనాల రేట్లపై అవగాహనలేదని అన్నారు. రైతులకు నాలుగు, ఐదు రుణమాఫి వాయిదాలను ఎగ్గొట్టినదానికి సహకరించిన వ్యక్తివి. పొలంలోకి వెళ్లి రైతుల సమస్యల గురించి మాట్లాడిన పరిస్దితి లేదు గాని మీడియా మైకుల ముందు మాత్రం పెద్ద ఫోజులు కొడుతూ మాట్లాడతావు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎవర్ని తిట్టమంటే వారిని తిట్టడం తప్పితే నీవు చేసింది ఏమిలేదని అన్నారు. నీకు అసలు వ్యవసాయశాఖపై అవగాహనేలేదు. అతితక్కువ ఆదాయం ఉన్న రాష్ర్టాల్లో ఏపిని నిలిపారు.ఇది నాబార్డ్ నివేదికలో ఉంది. అవినీతి,అప్పుల్లో నంబర్ 1 గా నిలిపిన ఘనత మీదే? -అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనబడలేదాఅని ప్రశ్నించారు. ఈ రోజు సమీక్ష జరగాలి అంటే మీరు చేసిన అవినీతిపై అక్రమాలపై సమీక్షలు జరగాలి.  సమీక్షలపై ఈసి దగ్గర్నుంచి వైయస్సార్ కాంగ్రెస్  సోమిరెడ్డి అంటే సోదిరెడ్డి, సోంబేరి రెడ్డి ,సోమరి రెడ్డి అనే చాలా బిరుదులు ఉన్నాయి. అయిపోయింది మీకు ఈ జన్మలో అవకాశం లేదు. చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకుందామని చివర్లో సచివాలయంకు వెళ్తున్నారు. మంత్రి యనమల  అసెంబ్లీలో ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుంటామంటే ఏదో అనుకున్నాం. ఇప్పుడు సంక్షోభమైన  ఫోని తుపానులో కూడా దండుకుందామనే అవకాశంగా మలచుకుంటున్నారని అన్నారు. తుపాను నిధులు పిండుకోవడానికి ఉన్న ఆతృత రైతు సమస్యలపై మీకు లేదు. నేను ప్రమాణస్వీకారం చేసిన తేదీ ఆధారంగా పలానా తేదీవరకు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు తప్పితే మరొకరు లేరని వ్యాఖ్యానించారు.

No comments:
Write comments