కోమటిరెడ్డి సోదరులకు మతి భ్రమించింది: గుత్తా

 

నల్గొండ మే 15 (globelmedianews.com)   
నల్గొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరుల శకం ముగిసిపోయిందని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని చెప్పారు. పిచ్చి పనులతో కోమటిరెడ్డి సోదరులు వారికి వారే ఓటమిని కొనితెచ్చుకుంటున్నారని అన్నారు. 


కోమటిరెడ్డి సోదరులకు మతి భ్రమించింది: గుత్తా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి అహంకారానికి చెంపపెట్టులాంటి తీర్పు వస్తుందని చెప్పారు. భువనగిరి పార్లమెంటు స్థానంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోనున్నారని జోస్యం చెప్పారు. నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమర్ రెడ్డి, జానారెడ్డిల పని అయిపోయిందని అన్నారు. 

No comments:
Write comments