విద్యుదాఘాతంతో రైతు మృతి

 

వరంగల్, మే 4 (globelmedianews.com)
విద్యుదాఘాతానికి  ఒక రైతు  పిన్నింటి సురేందర్ రావు మృతి చెందాడు. ఈ ఘటన ఖానాపురం మండలం అశోక్ నగర్ లో శనివారం ఉదయం జరిగింది. పంట పొలానికి వెళ్లిన ఆయనకు విద్యుత్ వైర్లు తగలడంతో షాక్ కు గురై మృతి చెందాడు. 


విద్యుదాఘాతంతో రైతు మృతి

సురేందర్ రావు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి వచ్చి సురేందర్ రావు శవానికి పంచనామా కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

No comments:
Write comments