ఆశా మీటింగ్ ను బహిష్కరించిన ఆశా వర్కర్లు

 

తుగ్గలి మే 7 (న్యూస్ పల్స్) 
మండల కేంద్రమైన తుగ్గలిలో సిపిఎం మరియు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా మీటింగ్ ను ఆశా వర్కర్లు బహిష్కరించారు.మండల కేంద్రంలో ప్రతినెల నిర్వహించే ఆశా కార్యకర్తల సమావేశంను బహిష్కరించి తుగ్గలి ప్రాథమిక వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.గత ఐదు నెలల నుంచి ఆశా వర్కర్లకు ప్రభుత్వం జీతాలు అందజేయడం లేదని,ఈ విషయం పై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారు స్పందించకపోవడంతో ఆశా మీటింగ్ ను బహిష్కరిస్తున్నట్టు ఆశా వర్కర్లు తెలియజేశారు. 


ఆశా మీటింగ్ ను బహిష్కరించిన ఆశా వర్కర్లు

ఆశా వర్కర్ల విషయంపై ప్రభుత్వం జాప్యం చేస్తుందని వారు తెలియజేశారు.ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు మీటింగ్ లను బహిష్కరిస్తామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీ రాములు, సిఐటియు మండల అధ్యక్షుడు శేఖర్ బాబు మరియు మండలంలోని ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments