ఉదయాన్నే ఆడ బిడ్డకు జన్మనించిన తల్లి…

 

అదే సమయంలో మొదటి బిడ్డ మృతి.
తుగ్గలి, మే 13, (globelmedianews.com)
తుగ్గలి మండల పరిధిలోని రామలింగాయపల్లెలో విషాదం చోటుచేసుకుంది.మండలం పరిధిలోని రామలింగాయపల్లే గ్రామంలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. రామలింగాయపల్లెకు చెందిన రాగుల సురేష్ ఆయన భార్య రాగుల లక్ష్మీదేవి రెండవ కాన్పు కోసం ఉదయాన్నే రామలింగాయపల్లే నుండి పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది, 


ఉదయాన్నే ఆడ బిడ్డకు జన్మనించిన తల్లి…

ఆసుపత్రిలో ఉదయాన్నే ఆడబిడ్డకు జన్మనిచ్చింది,అదే సమయానికి ఆమె మొదటి సంతానమైన కుమారుడు సిద్ధార్థ(2) రామలింగాయ పల్లేలో ఇంటి ముందు ఉన్న నీటి తొట్టెలో పడి   మృతిచెందాడు.ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.ఒక పక్క ఆడ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి తనకున్న కుమారుడు మృతిచెందడంతో ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది.ఈ విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిని వెంకట్రాముడు,ఎంపీపీ కొమ్ము వెంకటేశ్వర్లు,వైఎస్ఆర్సీపీ నాయకులు తిమ్మారెడ్డి,రంగనాథ రెడ్డి,వడ్డే వెంకటరాముడు ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు.…

No comments:
Write comments