కడుపులో బిడ్డను దొంగతనం చేసేశారు...

 

న్యూయార్క్, మే 17, (globelmedianews.com)
చికాగోలో కడుపులో బిడ్డను ఎత్తుకెళ్లిపోయారు. పుట్టబోయే బిడ్డకు ఉచితంగా బట్టలు ఇప్పిస్తానని పిలిచిన ఓ మహిళ.. ఆ గర్భిణీకి బతికి ఉండగానే నరకం చూపించింది. ఆమె కడుపులో ఉన్న బిడ్డను బలవంతంగా ప్రసవించేందుకు ఒత్తిడి చేసింది. చివరికి ఆమె కడుపు కోసి బిడ్డను ఎత్తుకెళ్లింది. అనంతరం ఆమె శవాన్ని ఓ ఇంటి వెనుక పడేసి పరారైంది. ఈ ఘటన చికాగోలో చోటుచేసుకుంది. 19 ఏళ్ల మార్లెన్ ఓచోయో లోపెజ్ తొమ్మిది నెలల గర్భవతి. ఆమె ఏప్రిల్ 23 నుంచి కనిపించడం లేదు. పుట్టబోయే బిడ్డకు ఎవరో దుస్తులు విస్తానని చెప్పారని, వాటని కలెక్ట్ చేసుకోడానికి వెళ్తున్నానని తెలిపిన మార్లెన్ ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన డిటెక్టివ్‌లు ఆమె ఫేస్‌బుక్ పేజీని పరిశీలించారు. ఆమె ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్న ఓ మహిళ.. తన ఇంటికి వస్తే పుట్టబోయే బిడ్డకు దుస్తులు ఇస్తానని మార్లెన్ గర్బంతో ఉన్న ఫొటో కింద కామెంట్ చేసింది. 


కడుపులో బిడ్డను దొంగతనం చేసేశారు...

ఇందుకు మార్లెన్ కూడా అంగీకరిస్తూ రిప్లై ఇచ్చింది. దీని ఆధారంగా డిటెక్టీవ్‌లు విచారణ వేగవంతం చేశారు. అయితే, హత్య జరిగిన రోజు ఓ మహిళ 911(పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్)కు ఫోన్ చేసి తన బిడ్డ ఊపిరి పీల్చుకోవడం లేదని, శిశువుకు సీపీఆర్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆ బిడ్డను చికాగోలోని క్రిస్ట్ హాస్పిటల్‌లో చేర్చారు. మరోవైపు కేసును విచారిస్తున్న డిటెక్టివ్‌లు ఈ విషయం తెలుసుకుని ఆ బిడ్డకు డీఎన్ఏ టెస్టులు చేయించారు. దీంతో ఆ బిడ్డ మార్లెన్ కొడుకేనని తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ బిడ్డను ఆసుపత్రిలో చేర్చిన మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మార్లెన్ భర్త యొవానీ లోపెజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. మార్లెన్ మరణించిందంటే నమ్మబుద్ధికావడం లేదని, ఆమె చాలా మంచిదని కన్నీరుమున్నీరయ్యాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరాడు. మార్లెన్ శవాన్ని పరీక్షించిన వైద్యులు.. ఆమె హత్యకు ముందు తీవ్ర పెనుగులాట జరిగిందని, ఆమె కడుపును గట్టిగా ఒత్తిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. డెలవరీ సాధ్యం కాకపోవడంతో హంతకులు ఆమె కడుపు కోసి బిడ్డను వెలికి తీసి ఉంటారని రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం మార్లెన్ బిడ్డను ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నారు.

No comments:
Write comments