కంచికచర్ల లో రోడ్డు ప్రమాదం..ముగ్గురికి గాయాలు

 

విజయవాడ, మే 17, (globelmedianews.com)
కృష్ణా జిల్లా కంచికచర్ల చెరువు కట్ట  జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.  శ్రీ సాయి కృష్ణ ట్రావెల్స్  ప్రైవేటు బస్సు ను ఎదురుగా వస్తున్న  లారీ  ఢీకొట్టింది.  ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. కేవలం  ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి.  తుని నుంచి హైదరాబాద్ కి వస్తున్న సాయి కృష్ణ ట్రావెల్స్ కృష్ణా జిల్లా కంచికచర్ల చెరువు కట్ట వద్దకు రాగానే ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తున్న లారీ ఢీకొనడంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.


కంచికచర్ల లో రోడ్డు ప్రమాదం..ముగ్గురికి గాయాలు

లారీ లో ఉన్న డ్రైవర్, క్లీనర్ కి,  బస్సులో ఉన్న ఒక మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి.  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు... ఈ క్రమంలో లో కొద్దిపాటి ట్రాఫిక్ అంతరాయం  కలిగింది.  క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం  108 ద్వారా  విజయవాడ ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

No comments:
Write comments