అదుపు తప్పి న బస్ బోల్తా

 

ఉట్నూరు మే 14, (globelmedianews.com)
అదిలాబాద్ జిల్లా  ఉట్నూర్ మండలంలోని దంతనపల్లి గ్రామ సమీపంలోని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళుతున్న  బస్ ఉట్నూర్ మీదుగా రా్తరి పది  గంటల సమయంలో మండలంలోని దంతనపల్లి గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో  డ్రైవర్ వసంత్ (48) అక్కడికక్కడే మృతి చెందారు. 


 అదుపు తప్పి న బస్ బోల్తా

బస్ లో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంకట రమణ, రాజేష్, వీరుబాయి, ప్రవీణ్, రాజమ్మ, రమేష్, పురుషోత్తలకు  గాయాలు అయ్యాయి.  అటుగా వెళుతున్న వారు 108 ద్వారా సమాచారం అందించారు. ఉట్నూరు లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవల కై ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై  అనిల్ పరిశీలించారు. 

No comments:
Write comments