నీటి కోసం మూగజీవాలు తపన

 


మెదక్, మే 25, (globelmedianews.com)
వేసవిలో తాగునీరు దొరక్క అడవిలోని జంతువులు అలమటిస్తున్నాయి. వాటికి నీటి వసతి కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నీటికోసం నిర్మించిన సాసర్‌పిట్లు నీరు లేక చెత్తాచెదారంతో నిండి దర్శనమిస్తున్నాయి. తాగు నీరు లేక వేసవితాపానికి మూగజీవాలు అనేకం మృత్యువాత పడుతున్నాయి.  జిల్లా పరిధిలో 58 వేల హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. జంతువులకు తాగునీటి సదుపాయం కల్పించడానికి అటవీ ప్రాంతంతో మొత్తం 70 సాసర్‌పిట్లను ఏర్పాటు చేశారు. రామాయంపేట మండలం కాట్రియాల తండాను ఆనుకునే ఉన్న  అటవీప్రాంతంలో సాసర్‌పిట్లతో పాటు ఎటువంటి సదుపాయాలు లేవు.


నీటి కోసం మూగజీవాలు తపన
దీంతో జంతువులు  దాహంతో  గ్రామాల శివారులోని పంటచేల వద్దకు వస్తూ ప్రమాదాల బారీన పడుతున్నాయి.  దంతేపల్లి, రాజ్‌పల్లి, పోచారం పరిధిలోని అటవీ ప్రాంతాల్లో  మూడు సోలార్‌ మోటార్లు ఏర్పాటు చేశారు.తాగునీరు లేక వందల సంఖ్యలో జంతువులు మృత్యువాతపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఈ సమస్య పరిష్కారం దిశగా అధికారులు ఆలోచించడం లేదు.   మండల పరిధిలోని దంతేపల్లి, పర్వతాపూర్‌ అటవీప్రాంతంలో గతంలో నీరు నింపేవారు. కానీ ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు దాటుతున్నా నీటి సదుపాయాలు మాత్రం మెరుగుపరచడం లేదు.  దంతేపల్లి, రాజ్‌పల్లి, పోచారం పరిధిలోని అటవీప్రాంతాల్లో  మూడు సోలార్‌ మోటార్లతో కొంతమేర ప్రయోజనం కలుగుతుంది. బోర్లు నిరంతరాయంగా నడుస్తుండటంతో  సమీపంలోని  కుంటలు నీటితో నిండి ఉంటున్నాయి.  ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాగే సోలార్‌ పంపులు బిగించాలని ప్రజలు అటవీప్రాంత ప్రజలు కోరుతున్నారు. వేసవి ప్రారంభంలో ఈ సాసర్‌పిట్లతో నీరు నింపిన అధికారులు ఇప్పటివరకు ఆవైపుకు కన్నెత్తికూడా చూడటం లేదు.

No comments:
Write comments