పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

 

నాగర్ కర్నూలు, మే 16 (globelmedianews.com)
ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా లోకసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మరియు నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇ. శ్రీధర్ అన్నారు.ఈ నెల 23న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్న దృష్ట్యా గురువారం ఆయన నాగర్ కర్నూల్ లోని లహరి గార్డెన్ లో ఓట్లలెక్కింపు కు నియమింపబడిన అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల సిబ్బందికి ఉద్దేశించి ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి క్షుణ్నంగా వివరించారు.
ఓట్ల లెక్కింపులో భాగంగా సిబ్బంది 23వ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు వారికి కేటాయించిన కౌంటింగ్ కేంద్రంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ చెప్పారు. ర్యాన్డ్ మైజేషన్ ద్వారా సిబ్బందికి ఓట్ల లెక్కింపు విధులను కేటాయించడం జరుగుతుందని, ఎన్నికలవిధుల పట్ల నిర్లక్ష్యం వహించి తప్పులకు బాధ్యులుఅయినట్లయితే ఇండియన్ పీనల్ కోడ్, ప్రజా ప్రాతినిధ్య చట్టంప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

ఓట్ల లెక్కింపు కేంద్రంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, కౌంటింగ్ కేంద్రంలో బారికేడింగ్, వైర్ మెష్, టేబుళ్లు, ఇతర కౌంటింగ్ సామాగ్రి ఏర్పాటు చేయడం జరుగుతుందని, కేటాయించిన టేబుల్ వద్ద సిబ్బంది వారి విధులను నిర్వహించాలని తెలిపారు.ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడని అందువల్ల సిబ్బంది ఎలాంటి సామగ్రి లేకుండా ఓట్ల లెక్కింపు విధులకు రావాలని, ఒకవేళ ఏదైనా సామాగ్రితో వస్తే నిర్దేశించిన కౌంటర్ వద్ద వాటిని డిపాజిట్ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడంచెల భద్రత కల్పించడం జరిగిందని, సెంట్రల్, స్టేట్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ తో పాటు సివిల్ పోలీసులు భద్రత నిర్వహిస్తారని తెలిపారు. సిబ్బందికి అవసరమైన భోజనం, తాగునీటి అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని అందువల్ల ఎలాంటి సామాగ్రిని తీసుకురావద్దని ఆయన  పునరుద్ఘాటించారు.ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతనే వి.వి పిఏ టి ల లోని ఓటర్ స్లిప్పులను లెక్కించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ఉయ్యాలవాడ లోని మోడల్ బీఈడీ కళాశాల , అలాగే నెల్లికొండి మార్కెట్ గోదాములో నిర్వహిస్తున్నందున ముందుగా ఆయా సెగ్మెంట్ల వారీగా, రౌండ్ ల వారీగా ఫలితాలు వెలువడతాయని, అన్ని సెగ్మెంట్ల ఫలితాలు తన దగ్గరికి వచ్చిన అనంతరం వాటిని క్రోడీకరించి ఫలితాలను రౌండుల వారీగా విడుదల చేస్తామని తెలిపారు. ఈ విడత ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సువిధ యాప్ లో కూడా ఉంచడం జరుగుతుందని, దీని ద్వారా ఫలితాలు వివరాలు మీడియాతో పాటు, ప్రజలు తెలుసుకునేందుకు అవకాశం ఉందన్నారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది 129వ సెక్షన్ ప్రకారం నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, అలాగే 136వ సెక్షన్ ప్రకారం ఈవీఎం లేదా ఎన్నికల సామాగ్రిని ట్యం పర్ చేస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 53వ నిబంధన ప్రకారం కౌంటింగ్ హాలులోకి ఎన్నికల సంఘం అనుమతించిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని, ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది, ఆర్ వో, వి ఆర్ ఓ, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఓట్ల లెక్కింపు ఏజెంట్లు, అనుమతి ఉన్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మాత్రమే కౌంటింగ్ హాలులోకి వచ్చేందుకు అనుమతి ఉంటుందన్నారు. మీడియా ప్రతినిధులను ఒక్కొక్కసారి ఐదు మందిని మాత్రమే తీసుకుని వచ్చి నిర్దేశించిన పాయింట్ నుండి ఫోటోలు, వీడియో తీసుకునేందుకు అనుమతిస్తామని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు. సెక్షన్ 128 ప్రకారం ప్రతి ఒక్కరూ సీక్రసీ ఆప్ ఓటింగ్ ను పాటించాలని కోరారు.ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం వి.వి పిఏ టి ల లోని ఓటరు స్లిప్పులను లెక్కించడం జరుగుతుందని, ఈ 5 వి.వి పిఎ టీ లను లాటరీ పద్ధతి పై ఆర్ ఓ లేదా ఏ ఆర్ ఓ ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. కౌంటింగ్ లో పాల్గొన్న సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డులను జారీ చేయడం జరుగుతుందని అందువల్ల ఈనెల 22వ తేదీ నిర్వహించే మాదిరి కౌంటింగ్ నాటికి ఫోటోలతో సహా వివరాలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. గుర్తింపు కార్డులు లేకుండా ఏ ఒక్కరిని కౌంటింగ్ హాలులోకి అనుమతించడం జరగదని అందువల్ల ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గుర్తింపు కార్డులతో రావాలని ఆదేశించారు.

No comments:
Write comments