చంద్రబాబు వెనుక మాఫియా

 

హైదరాబాద్, మే 03 (globelmedianews.com)
మామ ఎన్టీఆర్ కు వెన్నుపొటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుపై ఎవరికి నమ్మకం ఉండదు. టిడిపిలో ముసలం ఏర్పడింది.అదేంటంటే పార్టీలో బైబై బాబు అనే గ్రూప్ తయారైందని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ఓటమి చెందుతున్నానని తెలిసి రకరకాల విన్యాసాలు చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారిపైనే కేసులు పెడుతుంటాం. నెల్లూరు ఎంఎల్ ఏలను బెట్టింగ్ కేసులలో అన్యాయంగా ఇరికించారు.నానా రకాలుగా హింసించావు. అలాంటిది నిన్న చంద్రబాబు మాట్లాడుతూ బాంబేలో సట్టామార్కెట్ , మట్కా లాగే ఉంటుంది అందులో పందాలు కట్టండి.


చంద్రబాబు వెనుక మాఫియా

వారు మనకు ఫేవర్ గా ఉన్నారని చంద్రబాబు స్వయంగా అన్నారంటే పరిస్దితి ఎంత దిగజారిందో తెలుసుకోవచ్చని అన్నారు. మాఫియా తన వెనకా ఉందని సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి సట్టామార్కెట్ గురించి టిడిపి ఇన్ వాల్వ్ అవుుదామని పిలుపుఇచ్చారంటే...అది ఇల్లీగల్ కాబట్టి చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేయద్దు. చట్టాన్ని గౌరవించి చంద్రబాబుపై కేసు ఫైల్ చేస్తేనే ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటుంది. పదవికాంక్షతో చంద్రబాబు దేనికైనా దిగజారుతున్నారు. సిఎస్ నియామకాలలో కూడా చంద్రబాబు రాజకీయంగా విమర్శలు చేశారు. వైయస్ హయాంలో డిజిపిని బదిలీ చేస్తే హుందాగా వ్యవహరించారు. ఏబి వెంకటేశ్వరరావును బదిలి చేస్తే చంద్రబాబు ప్రవర్తన ఎలా ఉందో అందరికి తెలిసింది.ఈసి పరిధిలోకి ఏబి వెంకటేశ్వరరావు రారని చెప్పారు. ఎన్నికల పరిధిలోకి వచ్చే డిజిపి పై వైయస్సార్ కాంగ్రెస్ అనేక ఫిర్యాదులు ఇచ్చింది.ఈసి ఆయనపై ఎటువంటి చర్య తీసుకోలేదని అన్నారు. 

No comments:
Write comments