శ్రీని వాస్ రెడ్డిని వెంటనే ఉరి తీయాలి

 

హాజీపూర్ గ్రామస్థుల భారి ర్యాలీ
యదాద్రి భువనగిరి. మే 16(globelmedianews.com
బొమ్మల రామారంలో మళ్లీ ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. హంతకుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే ఉరి తీయాలని మండల కేంద్రంలో బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు ధర్నా చేసేందుకు ర్యాలీగా వెళ్లారు. దీంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. 


శ్రీని వాస్ రెడ్డిని వెంటనే ఉరి తీయాలి

శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్షపడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకైనా దిగేందుకు తాము సిద్ధమని తెలిపారు. విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని, సత్వరమే విచారణ పూర్తి చేసి కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో మహిళలు, బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు హత్యకు గురైన విషయం తెలిసిందే.

No comments:
Write comments