భద్రాద్రిలో పోలింగ్

 

భద్రాద్రి కొత్తగూడెం, మే 14, (globelmedianews.com)
తెలంగాణ రాష్ట్రం లో మూడవ  దశ ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు మంగళవారం  జరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  ఆరు మండలాల్లో ఎన్నికలు జరిగాయి.  ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  సాయంత్రం4  గంటల వరకు మాత్రమే ఓటు హక్కును  వినియోగించ   కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు . 


భద్రాద్రిలో పోలింగ్

ఆరు  మండలాల్లో లో 311 భూతులను ఏర్పాటు చేసారు.  మొత్తం ఓటర్లు లక్షా  48 వేల 5 73 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మావోయిస్టు ప్రభావిత  జిల్లా కావడంతో 1190 మంది  పోలీసులతో  బందోబస్తు ఏర్పాటు చేసారు. ఆరు మండలాల్లో 16 సమస్యాత్మక కేంద్రాలు కావడంతో పోలీసులు  ఎటువంటి అవాంఛనీయ సంఘటన   జరక్కుండా బందోబస్తు ఏర్పాటు చేసారు.  జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవిన్యూ సిబ్బంది,  పోలింగ్ అధికారులు  పోలింగ్ ను సక్రమంగా జరగడానికి కి అన్ని ఏర్పాట్లు చేశారు.

No comments:
Write comments