ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపుపై సూచనలు

 

కర్నూలు, మే,03, (globelmedianews.com)
సర్వీసు  ఓటర్లకు సంబంధించిన ఈటిపిబియస్ వచ్చిన ఓట్లను జాగ్రత్తగా  లెక్కించాలని ఎలక్షన్ కమీషన్ ఐటి డైరెక్టర్ వి.ఎన్.శుక్లా అన్నారు. శుక్రవారం న్యూఢి ల్లీ నుంచి దేశంలోని అన్ని రాష్టాల జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్ ఓ లతో ఈటిపిబియస్ ఓట్లు లెక్కింపు ప్రక్రియ పై వీడియో కాన్పరెన్స్ ద్వారా సూచనలు ఇచ్చారు. 


ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపుపై సూచనలు 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా వచ్చిన ఓటిపి ద్వారా క్యూఅర్ కోడ్ ను ఎంచుకుని ఫారం 13సి, 13ఎ, 13బి, ను స్కాన్ చేయాలన్నారు. ఆ తరువాత ఈ మూడింటిని స్టాపుల్ చేసుకుని అందులో నుంచి బ్యాలెట్ ను వేరుచేసి స్కాన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమలో జిల్లా నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ యస్.సత్యనారాయణ, జెసి పటాన్ శెట్టి రవిసుభాష్, మున్సిపల్ కమీషనరు, కర్నూలు ఏఈఆర్ ఓ ప్రశాంతి, జెసి-2 మణిమాల, డిఆర్ఓ వెంకటేశం, అన్ని నియెజకవర్గాల ఆర్వోలు, ఎఆర్ ఓలు, టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

No comments:
Write comments