ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతే

 

వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోచంపల్లి నామినేషన్ ధాఖలు.
ఎన్నికలంటేనే కాంగ్రెస్ కు వణుకు
ప్రజల గుండెల్లో టిఆర్ఎస్.
విలేకరులతో మంత్రి ఎర్రబెల్లి.
వరంగల్ అర్బన్ మే 14 (globelmedianews.com)
ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ కు వణుకు పుడుతోందని, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్పీలు, కార్పొరేషన్ చైర్మన్ లతో కలిసి మంగళవారం నామినేషన్ ధాఖలు చేశారు.    తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని..  ఎన్నికలు ఏవైనా విజయం టిఆర్ఎస్ పార్టీదేనని అన్నారు.    ఓటమి భయంతో రాష్ట్రంలో ప్రతి ఎన్నికలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తుందని విమర్శించారు.   


ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతే

 రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం 
న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ.. అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతున్నారని ఆరోపించారు.   ఎమ్పీటిసిలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ని అత్యధిక మెజార్టీ తో గెలిపించి, బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకు సహాకరించాలని సూచించారు.      అంతకు ముందు భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచంపల్లి, అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్పీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్ లు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొ.జయశంకర్, ప్రజాకవి కాళోజి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

No comments:
Write comments