సర్వీస్ ఓట్ల లెక్కింపు పై ఆదేశాలు

 

విజయవాడ, మే  03 (globelmedianews.com)
ఏప్రియల్, 11న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న సర్వీస్ ఓటర్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు.  శుక్రవారం న్యూఢిల్లీ నుండి కేంద్ర ఎన్నికల సంఘం ఐటి సంచాలకులు వి.ఎన్. శుక్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సర్వీసు ఓటర్ల వివరాలను తెలుపుతూ వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో 60,250 మంది సర్వీసు ఓటర్లు నమోదవ్వడం జరిగిందన్నారు. 


సర్వీస్ ఓట్ల లెక్కింపు పై ఆదేశాలు

సంబంధిత సర్వీసు ఓటర్లకు చెందిన బ్యాలెట్ పేపర్లను ఎలక్ట్రానిక్ ట్రాన్స్¬ఫర్మేషన్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్  ద్వారా పంపడం జరిగిందన్నారు. సంబంధిత ఓటర్లు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా తిరిగి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు పంపడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 13 వేల మందికి పైబడి సర్వీసు ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. మే, 23న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా సర్వీసు ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను తొలుత చేపట్టడం జరుగుతుందని, ఈ విషయంలో ఇప్పటికే సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులకు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వివరాలను పంపడం జరిగిందన్నారు.  ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుండి డిప్యూటీ సిఈఓ  చిరంజీవి, ఐటి పర్సన్ మల్లిఖార్జున్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments