నిరుపేద యువతి వివాహానికి చేయూత

 

జగిత్యాల  మే 16  (globelmedianews.com)
జిల్లా కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని  శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన యువతి వివాహానికి పది వేల రూపాయల నగదుతో పాటు మరో 10 వేల రూపాయలు వంట సామాగ్రిని పెళ్లి కూతురు తల్లిదండ్రులకు అందించి చేయాత నిందించారు. 


నిరుపేద యువతి వివాహానికి చేయూత

ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షుడు టీవీ సూర్యం , ప్రధాన కార్యదర్శి ఎన్. వి. రమణలు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సంఘ సభ్యుల సహకారంతో ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టీవీ సత్యం , పట్టణ అధ్యక్షులు బాల్యాల గంగారాం, ప్రధాన కార్యదర్శి నాంపల్లి, రామస్వామి, ట్రస్టు చైర్మన్ పడగంటి ఆనందం, నరసింహ ,పాలోజి సత్యం ,భూమయ్య తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments