ఇసుక ర్యాంపులు అత్యుత్సాహం..బోడేకు దెబ్బ....

 

విజయవాడ, మే 13, (globelmedianews.com)
2014 ఎన్నిక‌ల్లో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అభ్యర్థి దాదాపు 32 వేల మెజారిటీతో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఇక‌, ఇప్పుడు ముగిసిన ఎన్నిక‌ల్లోనూ ఆ అభ్యర్థికే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఆ నాటి ధైర్యం ఎక్కడా క‌నిపించ‌డం లేదు. అంతేకాదు, ఇప్పుడు అస‌లు మెజారిటీతో సంబంధం లేకుండా గెలిస్తే చాలు.. అని అనుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇంకా చెప్పాలంటే.. కొంత మేర‌కు ఆశ‌లు కూడా గ‌ల్లంత‌య్యే దుస్థితి వ‌చ్చింది. మ‌రి గ‌త ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం కైవ‌సం చేసుకున్న టీడీపీ ఇప్పుడు ఎందుకు డీలా ప‌డిపోయి.. జావ‌గారి పోయిన‌ట్టు? ఇక్క‌డ అస‌లు ఏం జ‌రిగింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఫ‌లితాల వెల్లడికి స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఈ ఉత్కంఠ మ‌రింత ఎక్కువైంది.విజ‌య‌వాడ‌కు స‌మీపంలోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించింది. గ‌తంలో కంకిపాడు, ఉయ్యూరు నియోజ‌క‌వ‌ర్గాలుగా ఉన్న ప్రాంత‌మే పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత పెన‌మ‌లూరుగా మారింది. నియోజ‌క‌వ‌ర్గంలో 50 వేల క‌మ్మ ఓట‌ర్లు, 70 వేల బీసీ ఓట‌ర్లు ఉన్నారు. ఇక్కడ అన్ని ఈక్వేష‌న్లు ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని టీడీపీకి కంచుకోట‌గా మార్చేశాయి. ఇక్క‌డ నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన బోడే ప్ర‌సాద్ దాదాపు 32 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు.


ఇసుక ర్యాంపులు అత్యుత్సాహం..బోడేకు దెబ్బ....

అయితే, ఇప్పుడు ఇక్కడ ప‌రిస్థితి రివర్స్ అయింది. సొంత పార్టీలోనే వ‌ర్గ పోరు బోడేకు సెగ‌పుట్టించింది. రెండు వ‌ర్గాలుగా మారిపోయిన త‌మ్ముళ్లు చాప‌కింద నీరులాగా బోడే ఓట‌మికి పావులు క‌ద‌ప‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. ఐదేళ్లపాటు బోడే మాస్ లీడ‌ర్‌గా ప్రజ‌ల్లోనే ఉన్నారు. అధికారుల‌పై దుందుడుకుగా ముందుకు వెళ్లడం… సొంత పార్టీ కేడ‌ర్‌నే లెక్క చేయ‌క‌పోవ‌డం… ఎలాగైనా గెలుస్తాను… నాకేంటి అన్న అతి ధీమాతో ఎన్నిక‌ల్లో ప్రసాద్‌కు భారీగా ఎఫెక్ట్ ప‌డిందిఇక‌, ఈ ప‌రిణామానికి తోడు ప్రధాన ప్రతిప‌క్షం వైసీపీ నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి పోటీ చేశారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన సార‌థి కేవ‌లం 177 ఓట్ల మెజారిటీతోనే గెలుపు గుర్రం ఎక్కారు. ఆ  త‌ర్వాత ఆయ‌న ప‌శుసంవ‌ర్థ‌క శాఖా మంత్రిగా కూడా ప‌నిచేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంపై త‌నదైన ముద్ర వేశారు. దీంతో ఇక్కడ ఆయ‌న‌కు సానుభూతి ప‌వ‌నాలు  వీస్తున్నాయి. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాల‌ని భావించినా.. పార్టీ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో మ‌చిలీప‌ట్నం ఎంపీగా పోటీ చేశారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను ఒప్పించిమ‌రీ  పెన‌మ‌లూరులో పోటీకి దిగారు. దీంతో స‌హ‌జంగానే ఇక్క‌ పోటీ హోరాహోరీగా మారింది. దీనికి జ‌న‌సేన మిత్రప‌క్షం బీఎస్పీ నుంచి పోటీ చేసిన లంక క‌రుణాక‌ర్ కూడా బాగానే పోటీ ఇచ్చారు. ఇక‌, ఐదేళ్ల  కాలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బోడే అనేక ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కాల్‌మ‌నీ కేసులో ప్రధాన ఆరోప‌ణ‌లు ఆయ‌న‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో ప్రస్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న  గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క మాత్రం కాద‌ని సొంత పార్టీ నాయ‌కులే అంటుండడం విశేషం.ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు త‌న‌యుడు నారా లోకేష్ ఒకానొక ద‌శ‌లో పెన‌మ‌లూరు నుంచే పోటీ చేస్తార‌ని  అనుకున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం పార్టీకి కంచుకోట‌ని.. ఇక్క‌డ పోటీ చేస్తే ప్ర‌చారం చేయ‌కుండానే లోకేష్ 50 వేల మెజార్టీతో గెలుస్తాడ‌ని అతి ధీమా పోయారు. అలాంటి చోట ఇప్పుడు టీడీపీ గెలుపు  క‌నాక‌ష్టమ‌వుతోంది.

No comments:
Write comments