కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు: ఈవో సింఘాల్

 

తిరుమల మే 3 , (globelmedianews.com)
బంగారం తరలింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. 


కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు: ఈవో సింఘాల్

భక్తులు శ్రీవారికి సమర్పించే ప్రతి కానుకకు తమ వద్ద లెక్కలు ఉన్నాయని ఆయన తెలిపారు. వేసవి రద్దీ దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మూడు నెలల పాటు వారాంతాల్లో బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేశామని వెల్లడించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో పేర్కొన్నారు.

No comments:
Write comments