రోజువారిగా రోగుల వివరాలను ఆన్ లైన్ లో తప్పక నమోదు చేయాలి

 

జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ.శరత్
జగిత్యాల మే 1 (globelmedianews.com)  
ఆసుపత్రికి ప్రతిదినము వచ్చే రోగుల వివారాలను రిజిష్టరులో నమోదు చేసే విధంగానే ఆన్ లైన్ లో కూడా తప్పక నమోదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ.శరత్ కోరారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ.శరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వారిగా ప్రసవాలపై కల్లెడ ,వెల్గటూర్ ,మల్యాల ,కథలాపూర్ ,ఇబ్రహీంపట్నం, ఖిల్లాగడ్డ ,మోతెవాడ ,మెట్ పెల్లి కేంద్రాల డాక్టర్లు ,సూపర్ వైజర్లులతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరగపోవడం పై గల.కారణాలు ఆడిగితెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు ఎందుకు జరగడంలేదని ,టార్గెట్ చేయని పలువురు సూపర్ వైజర్లులను మందలించారు.


రోజువారిగా రోగుల వివరాలను ఆన్ లైన్ లో తప్పక నమోదు చేయాలి

టార్గెట్కు దగ్గర ఉన్న వారు సక్రమంగా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ప్రసవాల టార్గెట్ నుపూర్తి చేయాలని కోరారు. ఎన్ సీడి లో బ్యాక్ లాక్ ఉన్న ఎనరోల్మేట్ ,స్ర్కేనింగ్ పూర్తి చేయని ఇబ్రహీంపట్నం ,ఐలాపూర్ ,కథలాపూర్ ,మాల్లాపూర్ ,రాయికల్, అంబరిపేట ,న్యూ మండలాల్లో పూర్తి కానివి పూర్తి చేయాలని సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిదినము వచ్చు రోగుల వివరాలను రిజిష్టరులో నమోదు చేసిన విధంగానే ఆన్ లైన్లో తప్పకుండా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కోరారు.ఆసుపత్రిలో సిసి కెమోరాలపై సరిగా పని చేస్తున్న లేదా ఒక వేల పని చేయని వాటికి వెంటనే బాగుచేయాలని వైద్యాధికారులను సూచించారు. అదేవిధంగా కంటి వెలుగు రాష్ట్రంలో మొదటి స్ధానంలో నిలిచి నందుకు ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. అదే స్ఫూర్తితో జిల్లాలో వైద్య సిబ్బంది పనిచేయాలని మీరు అందరు కలిసికట్టుగా పని చేసి వైద్యరంగములో కూడా ముందంజలో ఉండుటకు వీలుంటుందని ఆన్నారు. ఈసమావేశంలో సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రు ,జిల్లా వైద్యాధికారి పి.శ్రీధర్ ,ఆదనపు జిల్లా వైద్యాధికారి జైపాల్ రెడ్డి, ప్రోగం అధికారులు ,ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు ,సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments