అల్లూరి కి ఘన నివాళులు

 

కర్నూలు, మే, 7 (globelmedianews.com):
మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్  యస్ సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం  కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అల్లూరి సీతరామరాజు 95వ వర్ధంతి  సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళుర్పించారు. భారతదేశ స్వాతంత్ర పోరాట ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు చేసిన సేవ చరిత్ర ఎప్పటికీ మరువదన్నారు. ఇలాంటి మహనీయుల త్యాగల ఫలితాంగానే మనమదం నేడు స్వేచ్చ  వాయువును పొందుతున్నామన్నారు. 


అల్లూరి కి ఘన నివాళులు

ఆ రోజులో అనాగరికతకు గురైన గిరిజన ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన గొప్ప మానవతావాది అని. సాయధ పోరాటంతో బ్రిటీష్ వారిని ఎదుర్కొంటూ నమ్మిన సిద్దాంతాల ద్వారా స్వాతంత్ర పోరటం సాగించి దేశ సేవలో అశువులు బాసిన గొప్ప దేశభక్తుడు అల్లూరి అని అన్నారు.  బ్రీటీష్ అధికారుల దురాగతాలకు అడ్డుకట్ట వేసి వారిని భారతదేశం నుండి తరిమివేయడానికి అనేక పోరాటాలు చేసిన గొప్ప స్వాతంత్ర యెధుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన పెర్కొన్నారు. పోరాట దశలో అల్లూరి 1924 మే 7న పరమపదించారు. నేడు ఆయన చిత్రపటానికి పూలమాల  వేసి ఘనంగా నివాళ్లులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా  గిరిన సంక్షేమ శాఖ ఇంచార్జి అధికారి సోమశివారెడ్డి, జిల్లా సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా.చంద్రశేఖర్, వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి భాస్కర్ రెడ్డి, సెట్కూరు సిఇఓ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments