కోదాడలో బీజేపీ బంద్

 

కోదాడ, మే 2, (globelmedianews.com)
సూర్యాపేట జిల్లా కోదాడలో బిజేపి రాష్ట్ర బంద్ పిలుపుకు  ముందస్తుగా పార్టీ నాయకులను పోలీసులు  అరెస్టు చేపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైపల్యం కారణంగా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా  తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా కోదాడ పట్టణంలో పార్టీ  నాయకులను ముందుగా అరెస్ట్ చేసి,పోలీస్ స్టేషన్ కి తరలించారు.  


కోదాడలో బీజేపీ బంద్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అసమర్థ పరిపాలన వలన, వారి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు 25 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని,  విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.  దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ బందుకు పిలుపునివ్వడంతో నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు బలవంతంగా తమను లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారని ఆరోపించారు.  ఆత్మహత్యలు కారణమైన ఇంటర్ బోర్డు, విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు

No comments:
Write comments