సంక్షేమ పథకాలను మరవరాదు

 

నిజామాబాద్, మే 4 (globelmedianews.com)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల దృష్టిలో పెట్టుకొని జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జి పోచారం సురేందర్ రెడ్డి ఓటర్లను కోరారు శుక్రవారం వర్ని మండలం జలాల్ పూర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కూడా ఆదర్శంగా తీసుకొని.


సంక్షేమ పథకాలను మరవరాదు

ఈ పథకాలను అమలు చేస్తుందని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కి ఈ జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే రాష్ట్రంలో మండలంలో గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి అన్ని రకాల అభివృద్ధి కి కృషి చేస్తారని గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అందరూ ఉమ్మడిగా కృషి చేస్తారని ఆయన వెల్లడించారు ఇతర పార్టీలకు ఓట్లు వేసి ఓట్లు చెల్లకుండా చేయరాదని అభివృద్ధికి పాటుపడే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని సురేందర్రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు jalalpur గ్రామం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం సిసి రోడ్లు మురికి కాలువలు నిజాంసాగర్ ప్రధాన కాలువపై రైతుల పంటలకు లిప్ ను మంజూరు చేశామని ఎన్నికలైనా నెలరోజుల్లోపే దానికి శంకుస్థాపన చేసి రైతులకు సాగునీరు అందిస్తామని సురేందర్ రెడ్డి వెల్లడించారు వీటితోపాటు గ్రామంలో ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ప్రచార సభలో వర్ని టిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి హరిదాసు ఎం పి టి సి సావిత్రి మాజీ ఎంపిటిసి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్థానిక సర్పంచ్ అనిత వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments