చిత్ర లేఖనం పోటీల్లో ఏవీ అప్పారావుకు ప్రధమ స్థానం

 

రాజమండ్రి మే 6 (globelmedianews.com
అతడు పెన్సిల్‌ పట్టుకుని గీస్తే అద్భుత చిత్రాలు జాలు వారాల్సిందే. ఎటువంటి రూపానికైనా తన చేతి వాటంతో చక్కని రూపాన్ని ఇస్తాడతను. చిన్న తనం నుంచి అతడికి చిత్రలేఖనంపై ఉన్న మక్కువ... అందుకు తల్లిదండ్రులు ఇస్తున్న ప్రోత్సాహం వెరసి మంచి చిత్రకారుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నాడు. సింగపూర్‌లో మేడమ్‌ తుస్సాడ్‌ మ్యూజియంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మైనపు బొమ్మను ఆవిష్కరించిన సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక చిత్ర లేఖనం పోటీల్లో ఐదు వేల మంది పాల్గొనగా అతడు ప్రధమ స్థానం సాధించి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. అదీ కూడా మహేష్‌బాబు ముఖ చిత్రాన్నే గీశాడు. అతడే మన రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని జయశ్రీ గార్డెన్స్‌ 2వ వీధికి చెందిన పోలిన హర్షిత్‌ శ్రీవాత్సవ.


చిత్ర లేఖనం పోటీల్లో ఏవీ అప్పారావుకు ప్రధమ స్థానం

తల్లిదండ్రులు పోలిన వెంకట సత్యనారాయణ, పోలిన వీర వెంకట సత్య స్వరూపల కుమారుడు ఇతడు. చిన్న తనం నుంచి చిత్రలేఖనం ఉన్న మక్కువగా దానినే అలవాటుగా చేసుకుని అనే చిత్రాలు గీశాడు. మెగా స్టార్‌ చిరంజీవి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ వంటి అనేక చిత్రాలు గీసీ అందరి మన్ననలు పొందాడు. ప్రస్తుతం శ్రీవాత్సవ బెంగళూరులో క్రైస్ట్‌ విశ్వ విద్యాలయంలో ఆర్కిటెక్చర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్న తనం నుంచే తనకు చిత్ర లేఖనం అంటే చాలా ఇష్టమని తన తండ్రి ద్వారానే అది అలవాటైందని శ్రీవాత్సవ అంటున్నాడు. చిన్న తనంలో ఎవరికైనా ఏబీసీడీలు నేర్పించే సమయంలో కేవలం బొమ్మలు చూపించి నేర్పిస్తారని, అయితే తన తండ్రి మాత్రం 'ఎ ఫర్‌ ఆపిల్‌ అన్నప్పుడు ఆపిల్‌ బొమ్మ', 'బి ఫర్‌ బాల్‌ అన్నప్పుడు బాల్‌ బొమ్మ' గీసి చూపించడం వల్ల తనకు చిత్ర లేఖనంపై చిన్నప్పటి నుంచే మక్కువ పెరిగిందని శ్రీవాత్సవ అంటున్నాడు. అలాగే తాను కూడా ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా బొమ్మలు గీసి చూపించడం వల్లనే బాగా గీయగలుగుతున్నానని చెబుతున్నాడు. తన కుమారుడికి చిత్ర కళలలో ఇంతడి నైపుణ్యం వస్తుందని, మహేష్‌ బాబు చేతుల మీదుగా అవార్డు అందుకుంటాడని అనుకోలేదని శ్రీవాత్సవ తల్లిదండ్రులు అంటున్నారు. తమ కుమారుడికి ప్రోత్సాహం అందిస్తామంటున్నారు.

No comments:
Write comments