నల్లబియ్యంతో హలీమ్

 

హైద్రాబాద్, మే 17, (globelmedianews.com)
రంజాన్ వచ్చిందంటే.. హైదరాబాద్‌లో హలీం కోసం ఆహార ప్రియులు క్యూ కడతారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పిస్తా హౌస్ సరికొత్త హలీంను అందుబాటులోకి తెచ్చింది. అదే బ్లాక్‌రైస్ హలీం. సాధారణంగా హలీంను గోదుమలు, బియ్యంతో తయారు చేస్తారు. అయితే, ఈసారి వాటి స్థానంలో మణిపూర్ నుంచి తెచ్చిన ‘బ్లాక్ రైస్’తో హలీం తయారు చేస్తున్నారు. ఒకప్పుడు ఈ బ్లాక్ రైస్‌ను చైనాలోని రాజవంశీయులు మాత్రమే తినేవారు. 


నల్లబియ్యంతో  హలీమ్

ఈ బియ్యాన్ని క్రమేనా ఇండియాలో కూడా పండించడం మొదలుపెట్టారు. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పంట పడుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు, అధిక పోషకాల కారణంగా బ్లాక్ రైస్‌కు దేశావిదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. బ్లాక్ రైస్ మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచిదని, బరువు తగ్గాలనుకునేవారు ఈ బియ్యం తింటే సత్ఫలితాలు ఉంటాయనే ప్రచారం ఉంది. దీంతో పిస్తా హౌస్ ఈ నల్ల బియ్యం హలీంను హైదరాబాద్‌లోని ఆహార ప్రియులకు రుచి చూపించేందుకు సిద్ధమైంది

No comments:
Write comments